సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush Tickets: మన దగ్గర రూ.400 లోపే ఆదిపురుష్‌ను చూసేయొచ్చు కానీ.. ఈ నగరాల్లో టికెట్ల రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ABN, First Publish Date - 2023-06-14T14:17:20+05:30

దక్షిణాది నగరాల అయిన చెన్నై, హైదరాబాద్ లలో 'ఆదిపురుష్' సినిమా చూడటానికి టికెట్ ధర సుమారు రూ.400 వుంది. అదే సినిమా నార్త్ లో చూడాలంటె కొన్ని సిటీస్ లో ఎంత టికెట్ ధర ఉందొ తెలిస్తే షాక్ అవుతారు.

Prabhas from Adipurush
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంకో రెండు రోజుల్లో ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఈ సినిమా టికెట్స్ ధరలు గురించి గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమా కోసం సింగల్ స్క్రీన్ లో కూడా 50 రూపాయలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చారు. అలాగే మల్టీప్లెక్స్ లో కూడా ఈ సినిమా టికెట్ ధర సుమారు రూ.400 ఉంటుంది అని అంటున్నారు. ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వచించిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తీసినది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనపడనున్నాడు, అలాగే కృతి సనన్ సీతమ్మ కనపడుతుంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో హయ్యస్ట్ ధర రూ 400 రూపాయలు ఉంటే, కొన్ని సిటీస్ లో మాత్రం ఈ సినిమా చూడాలంటే మాత్రం మీ జేబుకు చిల్లు పడాల్సిందే. #AdipurushTicketPrice ఎందుకంటే అక్కడ టికెట్ ధరలు ఆకాశాన్ని అంటేలా వున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అయితే మీరు రూ 2,000 రూపాయలు తీసుకెళ్లాలి, ఎందుకంటే అక్కడ మొదటి టికెట్ ధర అక్షరాలా రెండు వేల రూపాయలు, రెండో రోజు రూ 1,800. పక్కనే వున్న నొయిడా లో అయితే రూ. 1,650 ఉంటుంది.

ఒక్క ఢిల్లీలోనే కాదండోయి, మిగతా సిటీస్ లో కూడా సుమారుగా అంతే వున్నాయి. ముంబై సిటీలో సోఫాలో కూర్చొని చూడాలి అనుకుంటే రూ. 2,000 పెట్టాలి, లేదా మామూలు టికెట్ ధర రూ.1,700 ఉంటుంది. బెంగుళూరు సిటీ లో కూడా ఇంచుమించు ఇదే ధరలో వున్నాయి. అక్కడ లక్సరీ టికెట్ ధర రూ. 1,600 నుండి 1,800 రూపాయల వరకు ఉంటే, మామూలు టికెట్ ధర రూ.1,150 నుండి 1,250 రూపాయల వరకు ఉంటుంది. ఇంకో మెట్రో సిటీ అయిన కలకత్తాలో కూడా టికెట్ ధర వెయ్యి రూపాయలు పైనే వున్నాయి.

దక్షిణాదికి వచ్చేసరికి మాత్రం సినిమాని చాలా తక్కువ ధరలోనే చూసేయవచ్చు. చెన్నై లో కొన్ని మాల్స్ లో రూ.225 రూపాయలు ఉంటే, ఇంకొన్ని థియేటర్స్ లో కేవలం రూ. 150 రూపాయలు మాత్రమే. ఇక మన హైదరాబాద్ కి వచ్చేసరికి కొన్ని మల్టిప్లెక్స్ లో రూ.295 రూపాయలు ఉండగా, మరికొన్ని మల్టిప్లెక్స్ లో టికెట్ ధర రూ.325 రూపాయలు చేశారు. అంటే మిగతా పట్టణాలతో పోలిస్తే, చెన్నై, హైదరాబాద్ లో టికెట్ ధర చాలా తక్కువగా వుంది. అందుకే బెంగుళూరు నుండి సినిమా చూసే ప్రేక్షకులు నలుగురు, అయిదుగురు కలిసి కార్లలో హైదరాబాద్ కేవలం మొదటి రోజు సినిమా చూడటానికే వచ్చి వెళ్ళిపోతూ వుంటారు.

Updated Date - 2023-06-14T14:17:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!