Adipurush dialogue writer: చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా..
ABN, First Publish Date - 2023-07-08T13:21:43+05:30
రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై అభిమానులను తీవ్రంగా నిరాశపరచింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ సీతగా జానకిగా నటించిన ఈ చిత్రంలో ఎన్నో లోపాలు ఉన్నాయంటే హిందూ సంఘాలు, అభిమానులు చిత్ర బృందంపై మండిపడ్డారు. తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణ కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు.
రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై అభిమానులను తీవ్రంగా నిరాశపరచింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ (omraut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతీసనన్ సీతగా జానకిగా నటించిన ఈ చిత్రంలో ఎన్నో లోపాలు ఉన్నాయంటే హిందూ సంఘాలు, అభిమానులు చిత్ర బృందంపై మండిపడ్డారు. రామాయణానికి విరుద్థంగా తీర్చిదిద్దారనే విమర్శలు వెల్లువెత్తాయి. పలు వివాదాలూ చుట్టుముట్టాయి. హనుమంతుడికి సంబంధించిన సంభాషణలు సరిగ్గా లేవని, తక్షణమే ఆ సంభాషణలు మార్చాలని డిమాండ్ చేయడంతో చిత్ర బృందం కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేశారు.
తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ (Manoj Muntashir) క్షమాపణ కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు. చేసిన తప్పును అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ‘‘ఆదిపురుష్’ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి. నా సోదరసోదరీమణులు, పెద్దలు, పూజ్యులైన సాధువులకు, శ్రీరామ భక్తులకు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. జరిగిన పొరపాటును అంగీకరిస్తున్నా. భగవాన్ హనుమాన్ కృప అందరిపై ఉండాలి. మా అందరికీ పవిత్ర సనాతన ధర్మాన్ని రక్షించే శక్తిని ప్రసాదించు’’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాటల పరంగా రచయిత స్పందించారు. మరి దర్శకుడు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. (Manoj Muntashir apologises)