సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush: విమర్శలు, ట్రోల్స్, వ్యతిరేకత ఇన్నిటిమధ్య ప్రభాస్ సినిమా వీకెండ్ కలక్షన్స్ చూస్తే షాక్

ABN, First Publish Date - 2023-06-19T12:22:49+05:30

మూడు రోజులకు గాని 'ఆదిపురుష్' సినిమా కలెక్షన్స్ బయటకు వచ్చేసాయి. ఎంత హైప్ తో విడుదల అయిందో ఈ సినిమా, అంతే ట్రోల్స్ కూడా గురయింది, విమర్శలకు తావిచ్చింది. ప్రభాస్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. మరి ఇంత విమర్శలు, ట్రోల్స్, నిరసనల మధ్య ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా..

Adipurush
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) రాముడు, సీతగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా జూన్ 16న విడుదల అయింది. ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి ఆట నుండే విమర్శలు మొదలుపెట్టారు. ఈమధ్య కాలంలో ఏ సినిమాకి ఇన్ని విమర్శలు రాలేదు, ఆసక్తికరం ఏంటంటే ప్రభాస్ అభిమానులు కూడా బయటకి వచ్చి ఈ సినిమా మీద విమర్శల వర్షం గుప్పించటమే కాకుండా, ట్రోల్స్ కూడా చేస్తున్నారు. సినిమా చూసిన వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎంత వ్యతిరేకించారు అంటే అంతగా వ్యతిరేకించారు. #AdipurushCollections

దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా వాల్మీకి రామాయణం ఆధారంగా తీసాను అని చెప్పాడు. ఒకవేళ అతను రామాయణం ఆధారంగా తీయకపోయినా కూడా, తనకి నచ్చిన విధంగా తీసినా, ఇంత దారుణంగా అందులోని పాత్రలను, వారి స్వభావాన్ని, ఆ పాత్రల ఔచిత్యాన్ని మొత్తం మార్చేశాడు. ఇది ఎవరికీ నచ్చలేదు. కానీ సినిమా ప్రచారాలు మాత్రం 'జై శ్రీరామ్' అంటూ శ్రీరాముడు పేరు మీదే చేశారు. ఒకవేళ రామాయణం ప్రాతిపదికగా సినిమా తీయకుండా తీశామని చెప్పుకున్న, శ్రీరాముడు పేరు వాడేసుకున్నారు కదా.

అలాగే ఈ సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్ లో ఒక కుర్చీ హనుమంతుడికి వదిలేస్తున్నామన్న అతి దారుణమైన వీక్ పాయింట్ మీద ఈ సినిమా విడుదల అయింది. అందుకని ప్రజలు ఈ సినిమాలో ఏముందో, ఎలా ఉందొ అని ఎగబడ్డారు చూడటానికి. కానీ తీరా చూస్తే, ఓం రౌత్ #AdipurushCollections తన స్వంత రామాయణం తీసి, డబ్బుల కోసం ప్రజల మనోభావాలతో ఆదుకున్నాడు అని అర్థం అయింది అని అంటున్నారు. ప్రభాస్ లాంటి ఒక పెద్ద స్టార్ , తెలుగులో అగ్ర నటుల్లో ఒకడు అయిన ప్రభాస్ కి తెలుగులో విశేష ఆదరణ ఉంటుంది అని కూడా చూడకుండా, తెలుగులో చెత్త మాటలు ఒక్కో పాత్ర ద్వారా చెప్పింది విమర్శలకు తావిచ్చాడు ఓం రౌత్.

అయితే ఇన్ని విమర్శలు, ఎన్నో లోటుపాట్లు ఈ సినిమాలో వున్నా ఈ సినిమా వీకెండ్ కలక్షన్స్ #AdipurushCollections ఎలా ఉన్నాయో తెలుసా, అదిరిపోయాయి. చాలా పట్టణాల్లో ఈ సినిమాకి ముందుగా టికెట్స్ బుక్ చేసేసుకోవటం ఒక కారణం అయి ఉంటుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఎందుకంటే కథానాయకుడు అభిమానులే ఈ సినిమా చూసి తలలు పట్టుకుంటున్నారు, అయినా కలెక్షన్స్ బాగున్నాయి అంటే కేవలం ముందుగా బుక్ చేసుకోవటం వలనే అని అంటున్నారు. 500 కోట్లు ఈ సినిమా మీద ఖర్చు పెట్టారని వార్తలు విపరీతంగా వాచ్యయి.

మూడు రోజులకు గాని ఈ సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ.216 కోట్లు షేరు కలెక్టు చేసిందని చెప్తున్నారు. ఒక్క తెలుగులోనే మూడు రోజులకు గాను సుమారు రూ. 85 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా కలెక్టు చేసిందని అనలిస్ట్స్ చెపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజులకు గాను సుమారు రూ.65 కోట్లు షేరు కలెక్టు చేసిందని చెపుతున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులు సుమారు రూ 190 కోట్ల వరకు వుంటాయని, సోమవారం నుండి ఈ సినిమా చెయ్యబోయే కలెక్షన్స్ కీలకం అని అంటున్నారు. కర్ణాటక లో బాగా వసూలు చేసింది, అలాగే తమిళ నాడు, కేరళ లో పరవాలేదు అన్నట్టుగా వున్నాయి కలెక్షన్స్.

మూడు రోజుల కలెక్షన్స్ (సుమారుగా):

తెలుగు:

ఆంధ్ర, తెలంగాణ: రూ. 65.02 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా: రూ. 9.7 కోట్లు

ఓవర్సీస్: రూ. 11.5 కోట్లు

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా: రూ 85.22 కోట్లు (ఈ అంకెలు సుమారుగా అటు ఇటు ఉండొచ్చు)

హిందీ వెర్షన్: 106.6 కోట్లు

Updated Date - 2023-06-19T12:22:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!