సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..

ABN, First Publish Date - 2023-04-05T14:43:34+05:30

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) కచ్చితంగా ఉంటుంది.

Adipurush in BIG Trouble
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) కచ్చితంగా ఉంటుంది. భారతీయ ఇతిహాసం రామాయణం (Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ (Om Raut( దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

అయితే.. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని మూవీ టీం భావించింది. అందుకు తగ్గట్లుగానే గతేడాది సెప్టెంబర్‌లోనే ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు మూవీ టీజర్‌ని కూడా విడుదల చేసింది. అయితే.. అది యానిమేటేడ్‌లా ఉండడం, అలాగే రాముడు, రావణుడి గెటప్‌పై కూడా విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో మూవీ టీం చిత్ర విడుదలని వాయిదా వేసి దిద్దుబాటు చర్యలకు దిగింది. (Complaint Filed Over Adipurush)

వాయిదా వేసిన విడుదల తేది దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. శ్రీరామనవమి నాడు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. అందులో.. సీత, రాముడు, లక్ష్మణుడుతో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు. దీనిపై కూడా నెటిజన్లు విపరీతంగా విమర్శలు చేశారు. హనుమంతుడి గెటప్‌ గడ్డం ఉండి, మీసం లేకుండా ముస్లింలా కనిపిస్తున్నాడని ఘాటుగా రాసుకొచ్చారు. అది పూర్తిగా మరిచిపోక ముందే ఈ చిత్రం మరోసారి చిక్కుల్లో పడింది. తమ మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఈ చిత్ర దర్శకుడిపై కంప్లైంట్ ఫైల్ అయ్యింది. (Complaint Filed Over Om Raut)

నివేదిక ప్రకారం.. సంజయ్ దీనానాథ్ తివారీ ముంబై హైకోర్టు న్యాయవాదులు - ఆశిష్ రాయ్ మరియు పంకజ్ మిశ్రా ద్వారా నిర్మాతలు, కళాకారుడు మరియు దర్శకుడు ఓం రౌత్‌పై సకినాకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు తనను తాను సనాతన ధర్మ బోధకుడిగా అభివర్ణించారు. అలాగే.. ఫిర్యాదు ప్రకారం కొత్త పోస్టర్‌లో.. ‘మర్యాద పురుషోత్తమ భగవానుడు శ్రీరాముడు హిందూ గ్రంథంలో పేర్కొన్న రామచరితమానస్ సహజ స్ఫూర్తికి, స్వభావానికి విరుద్ధమైన వేషంలో ఉన్నాడు. ఆదిపురుష్ రామాయణంలోని పాత్రలు జానేయు లేకుండా ఉన్నాయి. హిందూ సనాతన ధర్మంలో జానేయుకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని గురించి పురాణాల ఆధారంగా సనాతన ధర్మాన్ని అనుసరించేవారెవరైనా చెబుతారు. రాముడిని అలా చూపించడం ద్వారా చిత్రనిర్మాత ఓం రౌత్ హిందూ మత సమాజం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

Oscars95: ఏకంగా ఏనుగులని ఆస్కార్‌కి తీసుకుని వెళ్దామనుకున్నారంట.. కానీ..

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..


Updated Date - 2023-04-05T15:01:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!