సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adipurush: హనుమంతుడి పక్క సీటు గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దు!

ABN, First Publish Date - 2023-06-12T16:18:38+05:30

ప్రభాస్‌ (Prabhas) హీరోగా రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమాకు భారీగా బజ్‌ క్రియేట్‌ అయింది. దీని కోసం సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో టికెట్టు కొనుగోలు చేసి ఆ చిత్రంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్‌ (Prabhas) హీరోగా రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమాకు భారీగా బజ్‌ క్రియేట్‌ అయింది. దీని కోసం సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో టికెట్టు కొనుగోలు చేసి ఆ చిత్రంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. బాలీవుడ్‌ రణబీర్‌ కపూర్‌ 10000 టిక్కెట్లు, టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌ 10000 టికెట్లు, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కూడా 10000 టిక్కెట్లు కొనుగోలు చేసి అనాధలకు, ఎన్‌జీఓ సంస్థలకు అందజేయనున్నారు. సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లోనూ ఆంజనేయుడి కోసం ఓసీటు ఖాళీగా ఉంచాలని చిత్ర బృందం నిర్ణయించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ ఖాళీ సీటు పక్కన ఉండే సీటు టికెట్‌కు సంబందించి ఓ రూమర్‌ చక్కర్లు కొడుతుంది. రామ నామం వినబడే ప్రతి చోటుకి హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ఆయన కోసం ప్రతి థియేటర్‌లో ఓ సీటు ఖాళీగా ఉంచుతున్నారు. అయితే కొందరు ఆ సీటు పక్క టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారట.

ఈ విషయంపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆదిపురుష్‌’ టికెట్స్‌ విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి. హనుమంతుడి పక్క సీటు టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అన్నీ సీట్ల ధరకే ఆ టికెట్‌ను కూడా అమ్ముతున్నారు. దానికి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇలాంటి రూమర్స్‌ను సృష్టించొద్దు’’ అని ట్వీట్‌ చేసింది. ఓంరౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌ నిర్మించారు. ఈ నెల 16న విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-06-12T16:18:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!