కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sunaina : శ్రీవిష్ణు హీరోయిన్ కు అస్వస్థత

ABN, First Publish Date - 2023-10-21T13:39:15+05:30

శ్రీవిష్ణు(Shri Vishnu) హీరోగా నటించిన ‘రాజ రాజ చోర’ (Raja Raja chora) సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన (Sunaina). సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ నెటిజన్లను షాక్‌కి గురి చేసింది.

శ్రీవిష్ణు(Shri Vishnu) హీరోగా నటించిన ‘రాజ రాజ చోర’ (Raja Raja chora) సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన (Sunaina). సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. ఇటీవల సునైనా చేతికి సెలైన్‌ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటోను నెట్టింట షేర్‌ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరడానికి కారణం ఏంటనేది చెప్పలేదు కానీ త్వరలోనే సా్ట్రంగ్‌ అయ్యి తిరిగి వస్తాను’ అని ఫొటో పోస్ట్‌ చేశారు.

ఈ పోస్ట్‌ చూసిన కొందరు నెటిజన్లు సునైన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరిందని చెబుతున్నారు. 2005లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సునైన తమిళ చిత్రాల్లో ఎక్కువ నటించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘రెజీనా’. ‘అమెజాన్‌ ప్రైమ్‌లో స్ర్టీమింగ్‌ అవుతోంది.

Updated Date - 2023-10-21T13:39:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!