సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actress Jyothy - Drugs case: నాకే సంబంధం లేదు.. టెస్ట్‌కు రెడీ!

ABN, First Publish Date - 2023-06-25T16:47:49+05:30

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరితో తనకు పరిచయం మాత్రమే ఉందని, తమ మధ్య ఎలాంటి డ్రగ్‌ డీలింగ్స్‌ లేవని నటి జ్యోతి తెలిపారు. ‘‘డ్రగ్స్‌ కేసుకు నాకు సంబంధం ఉందో లేదో తెలుసుకోకుండా ఫొటోలు టెలికాస్ట్‌ చేయడం ఎంత వరకూ కరెక్ట్‌ అని ప్రశ్నించారు. క్రిమినల్‌గా నిర్ధారణ అయిన వారిని కూడా ముసుగుతో బయటకు చూపిస్తారు. ఏ సంబంధం లేని నా ఫొటోలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రగ్స్‌ కేసులో (Drugs Case) అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరితో తనకు పరిచయం మాత్రమే ఉందని, తమ మధ్య ఎలాంటి డ్రగ్‌ డీలింగ్స్‌ లేవని నటి జ్యోతి (Actress jyothy) తెలిపారు. ‘‘డ్రగ్స్‌ కేసుకు నాకు సంబంధం ఉందో లేదో తెలుసుకోకుండా ఫొటోలు టెలికాస్ట్‌ చేయడం ఎంత వరకూ కరెక్ట్‌ అని ప్రశ్నించారు. క్రిమినల్‌గా నిర్ధారణ అయిన వారిని కూడా ముసుగుతో బయటకు చూపిస్తారు. ఏ సంబంధం లేని నా ఫొటోలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

‘‘కేపీ చౌదరి (Kp Chowdary) నాకు మంచి మిత్రుడు మాత్రమే. తను హైదరాబాద్‌ వచ్చినప్పుడు తన బిడ్డను ఇంట్లో వదిలేస్తాడు . అతని డగ్స్‌ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ పార్టీలకు నేను హాజరు కాలేదు. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్‌లోనే ఉంది. విచారణకు నన్ను పిలిస్తే తప్పకుండా వెళ్తా. ఎలాంటి పరీక్షలకైనా నేను రెడీగా ఉన్నా. నేను ఇప్పటివరకూ మాదక ద్రవ్యాలు తీసుకోలేదు. నార్కొటిక్‌ టెస్ట్‌కూ నేను సిద్ధంగా ఉన్నా. ఆయన కాల్‌ డేటాలో నా పేరు ఉండడంతో పలు మీడియా సంస్థలు నా ఫొటోలు ప్రసారం చేస్తున్నాయి. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఫొటోలు ఎలా ప్రచురితం చేస్తారు. నాకంటూ ఒక జీవితం ఉంది. ఇలాంటివి చూస్తే నా కుటుంబ సభ్యులు బాధపడతారు. దయచేసి నిజనిజాలు ఏంటో తెలుసుకుని ఫొటోలు టెలికాస్ట్‌ చేయండి’’ అని జ్యోతి కోరారు. ప్రస్తుతం ఆమె పాల్వంచలో జరుగుతున్న ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌లో ఉన్నారు. ఆమె షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

‘కబాలి’ (Kabali producer) చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాత సుంకర కృష్ణప్రసాద్‌ అలియాస్‌ కేపీ చౌదరి ఇటీవల డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారు. ఈ నెల 14న ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో బయటికొచ్చిన మరోనటి అషురెడ్డి ఈ డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-06-25T16:47:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!