సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

HamsaNandini: అందరినీ ఉర్రూతలూగించే ఆమె నిజ జీవితంలో కథ వింటే షాక్ అవుతారు

ABN, First Publish Date - 2023-03-08T11:46:36+05:30

స్పెషల్ సాంగ్స్ లో కనపడుతూ ఉత్సాహంగా, ఉర్రూతలూగించిన హంసనందిని వెనక ఒక విషాద గాధ కూడా వుంది. అది ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సినిమాలలో ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి కనువిందు చేసిన నటి హంస నందిని (Hamsa Nandini). ప్రభాస్ (Prabhas) నటించిన మిర్చి (Mirchi) సినిమాలో 'మిర్చి లాంటి కుర్రాడు' (Mirchi lanti kurradu) అనే పాట కానీ, లేదా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'అత్తారింటికి దారేది' (Atharintiki Daredi) లో టైం ట పార్టీ (Time to Party) అనే పాటా కానీ ఏదైనా వెండి తెర మీద ఎంతో ఉత్సాహంగా ప్రేక్షకులను ఉత్తేజపరుస్తున్న ఆమె నిజ జీవితంలో జరిగిన సంఘటన వింటే ఆమె మిగతా మహిళలు ఎంత స్ఫూర్తిదాయకమో తెలుస్తుంది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో (Breast Cancer) చేసిన పోరాటాన్ని, ప్రయాణాన్ని అందరితో పంచుకున్నారు. ఆమెకి ఈ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సమయంలో అంటే జూలై 2020లో గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. పాపం ఆమె తల్లి కూడా 18 సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్‌తో పోరాడారు, అయితే దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయారు.

రోగ నిర్ధారణ తర్వాత భయం, గందరగోళం, ఆందోళన ఆవహించాయని గతాన్ని గుర్తుచేసుకున్నారు హంసనందిని. వరుస స్కాన్లు , పరీక్షల తర్వాత ఆమె ధైర్యంగా శస్త్రచికిత్స చేయించకొని ట్యూమర్ ని తొలగించారు. క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన 16 సైకిల్స్ కీమోథెరపీని కూడా ధైర్యంగా ఎదుర్కున్నారు. శస్త్ర చికిత్స అయి అంతా ఆనందంగా వుంది అనుకున్న సమయంలో మరో పిడుగుపాటు లాంటి వార్త.

అదే సమయంలో ఆమెకి BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీని అర్ధం. ఆమె జీవితకాలంలో మరో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 70% వుందని తెలిసింది. ఈ రిస్క్ ని ఎదుర్కోవడానికి ఏకైక మార్గమైన ఇంటన్సివ్ ఇన్వాసివ్ ప్రొఫిలాక్టిక్ సర్జరీని (Intensive Invasive Prophylactic Surgery) ఆమె గత సంవత్సరం చేయించుకున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. కఠినమైన చికిత్సలు, సవాలుతో కూడిన రోగనిర్ధారణ ఉన్నప్పటికీ, వ్యాధి తన జీవితాన్ని నిర్దేశించకూడదని,.. చిరునవ్వుతో పోరాడుతూ, తిరిగి తెరపైకి రావాలని, ఇతరులకు అవగాహన కల్పించడానికి, స్ఫూర్తిని నింపేలా తన కథను చెప్పాలని హంసనందిని తనకు తానుగా వాగ్దానం చేసుకున్నారు.

ఆమె రోగనిర్ధారణ చేసి ఏడాదిన్నర అయ్యింది. ఆమె అన్నట్టుగానే ముందస్తు రోగనిర్ధారణ, సమర్థులైన వైద్యులు సహాయక నెట్‌వర్క్, ఆమె కుటుంబ, సానుకూల మనస్తత్వం వలన తిరిగి ఆరోగ్యకరమైన స్థితికి వచ్చానని చెప్పారు హంసనందిని.

గతేడాది నవంబర్‌లో సినిమా షూటింగ్ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టారు హంసనందిని. ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలో బిగ్ స్క్రీన్ పైకి రావాలని ఎదురుచూస్తోంది. ట్రీట్‌మెంట్ తర్వాత సెట్స్‌లో తన అనుభవం గురించి అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పారు. "కెమెరా ముందు నేను ఎప్పుడూ లైవ్లీ గా ఫీలౌతాను. సెట్స్‌పైకి రావడం గొప్ప ఉత్సాహాని ఇస్తుంది. నేను ఇంతకు మునుపు కంటే బలంగా, మరింత శక్తివంతంగా వున్నాను’’ అన్నారు.

ఈ భయంకరమైన వ్యాధికి వ్యతిరేకంగా హంసా చేసిన సాహసోపేతమైన పోరాటం ఆమెకు అభిమానులు, సహచరులు, సెట్‌లో 'వారియర్ ' & 'ఫైటర్' అనే మారుపేర్లను సంపాదించిపెట్టాయి. సెల్ఫ్ -చెకప్‌లు, రెగ్యులర్ మామోగ్రఫీ, జన్యు పరీక్షల ద్వారా ముందస్తు రోగ నిర్ధారణ గురించి ఇతరులకు అవగాహన కల్పించడానికి తనను తాను అంకితం చేసుకోవాలని హంస నందని నిర్ణయించుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ మ్యానేజ్ మెంట్, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాల గురించి సమాచారాన్ని దేశం అంతటా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడం ఆమె లక్ష్యం. దీని గురించి అడిగినప్పుడు.. "నేను జీవించి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కీమోథెరపీ సమయంలో, నేను ప్రతి క్షణాన్ని నా చివరిదిగా జీవిస్తానని, మెరుగైన స్థితి కోసం ప్రయత్నిస్తానని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి మరణించిన నా తల్లి పేరు మీద 'యామినీ క్యాన్సర్‌ ఫౌండేషన్‌'ని నెలకొల్పుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.’’ అన్నారు

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసానందిని కథ.. సెల్ఫ్ కేర్, ముందస్తు గుర్తింపు, సపోర్ట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఆమె బలం, సంకల్పం అన్ని ప్రతికూల పరిస్థితులలో పోరాడటానికి, జీవితాలను సంపూర్ణంగా జీవించడానికి స్ఫూర్తినిస్తోంది.

Updated Date - 2023-03-08T11:48:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!