Actor Vishal: చంద్రబాబు అరెస్టు చూసాక, సామాన్యుడిగా నాకు భయం వేసింది
ABN, First Publish Date - 2023-09-20T14:58:41+05:30
చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసే ముందు కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సిందని, అలాగే అతని అరెస్టు చూసాక సామాన్యుడినైన నాకు చాలా భయం వేసిందని విశాల్ చంద్రబాబు అరెస్టు మీద వ్యాఖ్యానించాడు.
నటుడు విశాల్ (Vishal) తాజాగా 'మార్క్ ఆంటోనీ' #MarkAntony అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఎస్ జె సూర్య (SJSuryah) కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. అధిక్ రవిచంద్రన్ (AdhikRavichandran) దీనికి దర్శకుడు. ఈ సినిమా గత వారం విడుదలైంది తెలుగులో. ఇది టైము ట్రావెల్ నేపథ్యంలో తీసిన సినిమా. ఈ సినిమా ప్రచారాల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన విశాల్ సినిమా గురించి మాట్లాడారు, అలాగే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కి అభిమాని అని చెపుతూ వుంటారు. అటువంటి విశాల్ ని చంద్రబాబు అరెస్టు గురించి కామెంట్ చెయ్యమని అడిగితే, "కొంచెం అలోచించి చేయాల్సింది. అన్ని ఆధారాలు పెట్టుకొని అతన్ని అరెస్టు చేసి ఉంటే బాగుండేది. చంద్రబాబు గారికే ఆలా అరెస్టు చేస్తే, సామాన్యులమైన మా పరిస్థితి ఏంటి, ఆ అరెస్టు చూసాక నాకు భయం వేస్తోంది," అని అన్నాడు విశాల్. #ChandrababuArrest
చంద్రబాబుగారిని (ChandrababuNaidu) పోలీస్ డిపార్ట్ మెంట్ వారు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలియవు, అదీ కాకుండా నా ఓటు తమిళనాడులో వుంది. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్టు చేసే ముందు అలోచించి ఉండాల్సింది అని మాత్రం చెపుతాను. చంద్రబాబు గారు అడిగే ప్రశ్నలకు అసలు సమాధానాలే చెప్పలేకపోతున్నారు, అటువంటప్పుడు నాలాంటి సామాన్యులకు భయం వేస్తుంది అని అన్నాడు విశాల్. మేము స్క్రీన్ మీద కనిపిస్తాం, షూటింగ్ చేస్తాం, నటిస్తాం కానీ ఇంటికి వెళ్ళగానే మామూలు సామాన్య వ్యక్తులమే అని చెప్పాడు విశాల్. అయితే ఎన్ని చేసినా చివరికి న్యాయం గెలుస్తుందనే నమ్మకం నాకుంది అని అన్నాడు విశాల్.