Abhinav gomatam : లవ్వూ లేదు.. గివ్వూ లేదు.. జరిగింది ఇదే!
ABN, First Publish Date - 2023-10-29T16:10:04+05:30
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రంలో సమంతకు అక్కగా నటించిన కల్పికా గణేష్ (Kalpika Ganesh) గురించి పరిచయం అక్కర్లేదు. తర్వాత పలు చిత్రాల్లో మెయిన లీడ్‌గా కూడా చేసింది. గత ఏడాది అభినవ్ గోమటంపై (Abhinav Gomatam) ఆమె ఎన్నో ఆరోపణలు చేసింది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రంలో సమంతకు అక్కగా నటించిన కల్పికా గణేష్ (Kalpika Ganesh) గురించి పరిచయం అక్కర్లేదు. తర్వాత పలు చిత్రాల్లో మెయిన లీడ్‌గా కూడా చేసింది. గత ఏడాది అభినవ్ గోమటంపై (Abhinav Gomatam) ఆమె ఎన్నో ఆరోపణలు చేసింది. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరిగింది. అభినవ్ తనను వేధించాడని, తన పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఈ గొడవలో చివరకు పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా కల్పికా గణేష్‌పై అభినవ్ గోమటం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్పిక తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, ఆమెతో ఎలాంటి ఎఫైర్ లేదని వివరణ ఇచ్చారు.
‘మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసుకునేవాళ్లం. అది కూడా ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి. అయితే, గతేడాది నవంబర్‌లో ఒక సంఘటన జరిగింది. ఆమెకు నారీ శక్తి అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది. ఆ అవార్డు గురించి నేను ఎప్పుడూ వినలేదు.. కానీ నీకు రావడం చాలా గొప్ప విషయం అంటూ అభినందిస్తూ రిప్లై ఇచ్చాను. అప్పటి నుంచి గొడవ మొదలైంది. ఆ అవార్డు గురించి వినలేదు అంటావా..? నీకు అంత చులకనా? నీకు అంత ఇగోనా? అంటూ పెద్దగా పొట్లాటకు దిగింది. ఆ సమయంలో నేనొక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకున్నాను. ఆమె నన్ను పురుషాహంకారి అదీ ఇదీ అంటూ మెసేజ్ లు చేస్తోంది. దీంతో నేను రిప్లై ఇవ్వడం ఆపేశాను. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఆమె ప్రతి ఒక్కరితోనూ గొడవే. ఆ అవార్డు గురించి నాకు తెలియదు అన్న పాపానికి ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అందులో తప్పేముందని చాలామంది నెటిజన్లు ఆమెను తప్పుపట్టారు. అవార్డు గురించి తెలియదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలని కూడా ఆమె మెసేజ్‌లు పెట్టింది. అప్పుడు జరిగిన విషయం ఇదే.. అంతే కానీ ఆమెతో ఎలాంటి లవ్వు, గివ్వూ లేదు. నేను ఎలాంటి ప్రేమ కావ్యాలు రాయలేదు" అని అభినవ్ తెలిపాడు.