Dil Raju Family : దిల్‌రాజు ఇంట పెళ్లి బాజాలు?
ABN, First Publish Date - 2023-10-28T11:19:28+05:30
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠీ (varun - lavanya) పెళ్లి పీటలు ఎక్కేందుకు ఇటలీ వెళ్లారు. నవంబర్ ఒకటో తేదిన వీరిద్దరి వివాహం జరగనుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠీ (varun - lavanya) పెళ్లి పీటలు ఎక్కేందుకు ఇటలీ వెళ్లారు. నవంబర్ ఒకటో తేదిన వీరిద్దరి వివాహం జరగనుంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హవ్య వాహిని(Havya vahini) నిశ్చితార్థం ఇటీవల క్రితం విజయవాడకు చెందిన అబ్బాయితో జరిగింది. మరోవైపు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ కోడూరి (Srosimha koduri) వివాహం సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరోవార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో కూడా పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి 9Ashish reddy) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశకు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురిని ఆశిష్ పెళ్లాడబోతున్నారని, డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగుతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న జైపూర్‌లో పెళ్లి జరుగుతుందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
మరో విషయం ఏంటంటే ఇటీవల దిల్ రాజు (Dil raju) తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన చనిపోయి ఏడాది పూర్తికాకముందే ఇంట్లో శుభాకార్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆశిష్‌రెడ్డి గత ఏడాది ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ సొంత బ్యానర్‌లోనే ‘సెల్ఫిష్’ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సుకుమార్ శిష్యుడు విశాల్ కాశి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.