Happy Birthday Prabhas: తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన స్టార్ ప్రభాస్
ABN, First Publish Date - 2023-10-23T13:25:50+05:30
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు, ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఒక ప్రత్యేక వ్యాసం.
తెలుగు సినిమా చరిత్రలో అప్పటి తరం కథానాయకులను చూస్తే నందమూరి తారక రామారావు (NTRamaRao), అక్కినేని నాగేశ్వర రావు (AkkineniNageswaraRao), సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna), కృష్ణంరాజు (KrishnamRaju) ఇలా ఒక్కో నటుడికి ఒక్కో విధమైన ప్రత్యేకమైన శైలి ఉండేది. అలాగే ఆ నటులందరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు కూడా అందించారు. ఆ తరువాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున (AkkineniNagarjuna), వెంకటేష్ (Venkatesh) వీళ్ళు కూడా పాత తరం నటుల లెగసీ ని కంటిన్యూ చేశారు. మళ్ళీ తరువాత తరం కథానాయకులలో మహేష్ బాబు (MaheshBabu), పవన్ కళ్యాణ్ (PawanKalyan), ప్రభాస్ (Prabhas) లు కూడా తెలుగు సినిమా పరిశ్రమలో తమ స్టామినా అంటే ఏమిటో చూపించారు. అయితే ఇందులో ప్రభాస్ ప్రత్యేకం చెప్పుకోవాలి. అతను తెలుగు సినిమాని ఒక ప్రాంతీయ భాషాది చిత్రాలుగా కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సాధించిన నటుడు ప్రభాస్ అని చెప్పాలి.
'ఈశ్వర్' సినిమాతో పరిశ్రమలోకి కృష్ణం రాజు (KrishnamRaju) వారసుడిగా అడుగుపెట్టారు ప్రభాస్. మొదట్లో పెదనాన్న కృష్ణంరాజు అనుకరిస్తున్నరు అని అందరూ అనుకున్నా, వారసత్వం అంటే సునాయాసంగా వచ్చేది కాదు అని ప్రభాస్ సినిమా సినిమాకి తన కష్టంతో, ప్రతిభతో తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు, ఎదిగాడు, వొదిగి వుండాలనుకున్నాడు, సాధించాడు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించాడు పెద్ద స్టార్ అయ్యాడు, పెదనాన్న ఊహించినంత ఎత్తుకు ఎదిగాడు. అది ప్రభాస్ స్టామినా. ఈరోజు ఆ ప్రభాస్ పుట్టినరోజు.
ప్రభాస్ (Prabhas) కు మొదటి కమర్షియల్ హిట్ 'వర్షం' రూపంలో వచ్చింది. తరువాత రాజమౌళి అమ్మ సెంటిమెంట్ ప్రభాస్ తో తీసిన 'ఛత్రపతి' ప్రభాస్ కి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. అప్పటి నుండి ప్రభాస్, రాజమౌళి ల మధ్య మంచి స్నేహంకూడా కుదిరింది. ఆ తరువాత 'డార్లింగ్' సినిమా నుండి ప్రభాస్ డార్లింగ్ అయ్యాడు, అందరినీ ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాడు. తాను 'మిస్టర్ పర్ ఫెక్ట్' అని నిరూపించుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాలు బాగా ఆడలేదు కూడా. 'రాఘవేంద్ర' 'అడవిరాముడు', 'చక్రం', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా', 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్‌నిరంజన్' 'రెబల్' సినిమాలు వ్యాపారాత్మకంగా సరిగ్గా నడవకపోయినా ప్రభాస్ ని నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చెయ్యడానికి ఉపకరించాయి.
ఆ తరువాత వచ్చింది కొరటాల శివ (KoratalaSiva) దర్శకత్వంలో 'మిర్చి' #Mirchi. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ స్పెషల్ సినిమా. ఎందుకంటే అప్పటికి ఒక పెద్ద బ్రేక్ రావాలని చూస్తున్న ప్రభాస్ కి ఈ సినిమా అతి పెద్ద బ్రేక్ ఇవ్వటమే కాకుండా, ఈ సినిమాతో ప్రభాస్ మరికొంత అభిమానులని ఎక్కువ చేసుకోగలిగారు. ఈ సినిమా చేస్తుండగానే దర్శకుడు రాజమౌళి (SSRajamouli) తన 'బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ ని తప్ప వేరే నటుడుని వూహించలేను అని ప్రభాస్ తో 'బాహుబలి' సినిమా చేసాడు. ఇది రెండు పార్టులుగా రావటమే కాకుండా, ప్రభాస్ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు చేసింది. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగింది.
అందుకే తెలుగు సినిమా మార్కెట్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ కే దక్కుతుందని ప్రతివాలు చెపుతూ వుంటారు. అందుకే ఏ తెలుగు నటుడు మాట్లాడినా ముందు 'బాహుబలి' కి థేంక్స్ అంటూ మొదలెడతారు, మార్కెట్ విషయానైకి వచ్చేసరికి. తెలుగు సినిమాకు రూ. 2000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని 'బాహుబలి-2'తో ప్రభాస్ నిరూపించాడు. విదేశీ మార్కెట్‌లో కూడా పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి కథానాయకుడు ప్రభాస్.
'బాహుబలి' #Baahubali రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది. 'బాహుబలి' తరువాత 'సాహూ' సినిమా చేసాడు ప్రభాస్. ఇది హిందీలో చాలా బాగా నడిచింది, రెగ్యులర్ హిందీ సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ రాబట్టింది. అంతే ప్రభాస్ తన స్టామినా ఒక్క తెలుగు పరిశ్రమకే కాకుండా, మిగతా భాషలకి కూడా ఎగబాకింది. అందుకు తగినట్లే ప్రభాస్ రాబోయే సినిమాలు చూస్తే అవన్నీ కూడా ఒక్క తెలుగు ప్రేక్షకులని కాదు, ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూసేంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అని అర్థం అవుతోంది.
ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్ట్యాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం.
ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విరాళాలు ఇవ్వడంలో ప్రభాస్ ది పెద్ద చేయి. మిగతా స్టార్స్ కంటే పెద్ద మొత్తంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలకు అందిస్తుంటారు డార్లింగ్. సమాజం పట్ల, తన ప్రేక్షకుల పట్ల ప్రభాస్ కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల లైనప్ చూస్తుంటే ఆశ్చర్యం, ఆసక్తి వున్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel) రూపొందిస్తున్న 'సలార్' పార్ట్ 1 సీజ్ ఫైర్ #Salaar డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ (NagAshwin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కల్కి 2898ఏడీ' (Kalki2898AD) పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. భారీ బడ్జెట్ తో ప్రపంచస్థాయి టెక్నాలజీతో 'కల్కి 2898 ఏడీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఒక స్పెషల్ మూవీ కానుంది. ప్రభాస్ ను కొత్త జానర్ లో, సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు దర్శకుడు మారుతి (DirectorMaruthi). టి సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) రూపొందించే 'స్పిరిట్' #Spirit సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్నాయి. ముందు ముందు ఈ సినిమాలతో మరిన్ని పెద్ద హిట్స్ ఇవ్వాలని హ్యాపీ బర్త్ డే టు డార్లింగ్ ప్రభాస్.