సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sreeleela: బర్త్‌డే బ్యూటీ.. శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా..?

ABN, First Publish Date - 2023-06-14T16:43:21+05:30

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరంటే... రెండో ఆలోచన లేకుండా అందరినోటా పలికే పేరు... శ్రీలీల. సీనియర్‌, యంగ్‌ హీరోలు అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’గా మారింది. జూన్ 14 ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాలలోని లుక్స్‌ని ఆయా మేకర్స్ విడుదల చేశారు. దీంతో టాలీవుడ్ అంతా శ్రీలీల పేరు మారుమోగుతోంది.

Heroine Sreeleela
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ (Tollywood)లో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరంటే... రెండో ఆలోచన లేకుండా అందరినోటా పలికే పేరు... శ్రీలీల (Sreeleela). సీనియర్‌, యంగ్‌ హీరోలు అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’ (Talk of the Industry)గా మారింది. జూన్ 14 ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాలలోని లుక్స్‌ని ఆయా మేకర్స్ విడుదల చేశారు. దీంతో టాలీవుడ్ అంతా శ్రీలీల పేరు మారుమోగుతోంది. అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాపై దాడి చేయడంతో.. శ్రీలీల పేరు కొన్ని గంటలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ ఫస్ట్ లుక్స్‌ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. శ్రీలీల గురించి కొన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. (#HBDSreeLeela)

తాతయ్యకు మాటిచ్చాను

నేను ఎల్‌కేజీ (LKG)లో ఉన్నప్పుడనుకుంటా... ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావ్‌ అని అడిగితే.. ‘డాక్టర్‌’ (Doctor) అవుతానని చెప్పేదాన్ని. నన్ను వైద్యురాలిగా చూడాలనేది మా అమ్మమ్మ, తాతయ్యల కల. సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నా చదువు పాడవుతుందేమోనని వాళ్లు భయపడ్డారు. ‘నేను కచ్చితంగా డాక్టర్‌ అయితీరుతాన’ని తాతయ్యకి మాటిచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా నా వెంట పుస్తకాలు ఉండాల్సిందే. పరీక్షలు దగ్గరపడితే.. పగలంతా షూటింగ్‌లో పాల్గొని, రాత్రంతా పుస్తకాలు తిరగేస్తుంటా.

ఫేస్‌బుక్‌ (Facebook)లో చూసి...

అసలు సినిమాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు ఇద్దరు అన్నయ్యలు. అమ్మ ప్రతీ ఏడాది మా ముగ్గురికి ఫొటో షూట్‌ చేయిస్తుండేది మా ఫ్యామిలీ ఫ్రెండ్‌, ఫొటోగ్రాఫర్‌ భువన్‌తో. ఆయన మా ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తే, ఓ కన్నడ డైరెక్టర్‌ ‘కిస్‌’ (Kiss) సినిమా కోసం నన్ను సంప్రదించారు. అలా సినిమాల్లోకి అడుగుపెట్టా. నిజానికి అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉన్నా. ఆ సమయంలో నా జుట్టు చాలా పొడుగ్గా, మోకాలు వరకు ఉండేది. కానీ సినిమా కోసం మొత్తం కత్తిరించుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకు బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూగా సైమా అవార్డు లభించింది.

ఇంట్లో కూడా తెలుగే...

నేను క్లాసికల్‌ డ్యాన్సర్ని. అందుకే నా ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ అయినా క్లియర్‌గా తెలిసిపోతుంది. నేను తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మే. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. అమ్మ గైనకాలజిస్ట్‌. ‘కెజియఫ్‌’ (KGF) హీరో యష్‌ భార్యకు ప్రసవం పోసింది మా అమ్మే. అలా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అయిపోయాం. ఓసారి అనాథాశ్రమానికి వెళ్లాను. అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న శోభిత, గురు అనే ఇద్దరు పిల్లలను చూసి వాళ్లని దత్తత తీసుకున్నా. (Sreeleela Birthday Special)

కోపం కాస్త ఎక్కువ

నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు. కొన్నిసార్లు తెలియకుండానే కోపం తన్నుకువచ్చేస్తుంది. పెద్ద ముక్కు ఉన్నవాళ్లు కోపిష్ఠులని అంటారు కదా. అందుకేనేమో నాకూ కోపం ఎక్కువ. నా కోపానికి అమ్మ ఎక్కువసార్లు బలైంది. కోపం చల్లారాక అమ్మను అనవసరంగా తిట్టానని ఏడ్చేస్తుంటా.

వర్కవుట్స్‌ నచ్చవు

నాకు వర్కవుట్స్‌ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కేవలం యోగా మాత్రమే చేస్తా. అది నాలో పాజిటివ్‌ ఎనర్జీని నింపుతుంది. యోగా రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడమే గాక, ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. దాంతో రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. స్విమ్మింగ్‌, డ్యాన్స్‌ కూడా నా దినచర్యలో భాగమే.

అంత్యాక్షరి ఆడుతా...

ఇంట్లో నా ముద్దుపేరు అమ్ములు. అంత్యాక్షరి ఆడడమంటే చాలా ఇష్టం నాకు. పైకి మోడ్రన్‌గా కనిపిస్తాను కానీ కాస్త పాత కాలం మనిషినే. నాకు కాబోయేవాడు కూడా నాలాగే పాత కాలం మనిషై ఉండాలనుకుంటా. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుంకుడుకాయ రసం, మందారాకు తలకు పెట్టుకుంటా. నా బ్యాగ్‌లో ఫోన్‌, ఎయిర్‌పోడ్స్‌, అమ్మవారి కుంకుమ ఎప్పుడూ ఉంటాయి.

రిజెక్ట్‌ చేశా...

‘ధమాకా’ (Dhamaka) దర్శకుడు మొదట ‘హలో గురు ప్రేమకోసమే’ (Hello Guru Prema Kosame) సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం నన్ను కలిశారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమాను ఒప్పుకోలేదు. తరువాత ‘ధమాకా’ కథ నాకు బాగా నచ్చడంతో కేవలం పది నిమిషాల్లోనే ఓకే చెప్పేశా. ‘ధమాకా’ తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే..

ఇవి కూడా చదవండి:

**************************************

*Prabhas Srinu: తల్లి సమానురాలితో ఎఫైరా?.. రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను క్లారిటీ!


**************************************

*Varun Tej: ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యతో కలిసి.. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్

**************************************

*Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?

**************************************

*Adipurush: ఆదిపురుష్‌ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!

**************************************

*Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..

**************************************

Updated Date - 2023-06-14T16:43:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!