Sai Dharam Tej: ‘విరూపాక్ష’ను ‘కాంతార’తో పోల్చవద్దు
ABN, First Publish Date - 2023-04-19T16:45:11+05:30
‘విరూపాక్ష’ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించారు. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో.. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హీరో సాయి ధరమ్ తేజ్ మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..
‘‘ఇప్పుడు కాస్త వయసు పెరిగింది. మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయితే అందరం హ్యాపీగా ఉంటాం. రికార్డ్స్ బద్దలు కొట్టాలనేం అనుకోం. ప్రతీ వారం రికార్డ్స్ బ్రేక్ అవుతుంటాయి. రికార్డులు ఉన్నదే బ్రేక్ అవడానికి. 80, 90వ దశకంలో ఈ కథ ఉంటుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏంటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ విరూపాక్ష. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే విరూపాక్ష అని టైటిల్ పెట్టాం. మొదటిసారి ఇలాంటి కొత్త జానర్ చేశాను. నేను ఇంతకు ముందు జీవించాను. కానీ ఇప్పుడు మాత్రం నటించాను. ప్రతీ ఒక్క హీరోకి ప్రతీ సినిమా మొదటి సినిమాలానే ఉంటుంది. అలానే కష్టపడతారు. (Sai Dharam Tej Interview)
ఈ సినిమాను ‘కాంతార’ (Kantara)తో పోల్చను.. పోల్చవద్దు. అది కల్ట్ క్లాసిక్ సినిమా. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇండియానా జోనస్ సినిమాలు నాకు చాలా ఇష్టం. హారర్ సినిమాలు చూడటం వేరు.. చేయడం వేరు. నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడిని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. 80, 90వ దశకంలోని కథ కాబట్టి.. అప్పట్లో ప్రేమలు ఎలా ఉండేవో తెలుసుకున్నాను. అవన్నీ రీసెర్చ్ చేశాం. సెట్‌లో నాకు అందరూ సపోర్ట్ చేశారు. అన్ని భయాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలనేది నేను నమ్ముతాను. ఈ సినిమాలో కథ కూడా అలానే ఉంటుంది. ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. మీడియా సపోర్ట్‌తో ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుంది. మన తెలుగుదనాన్ని పాన్ ఇండియాకు తీసుకెళ్తున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకున్నాం. అందుకే ముందు తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. తరువాత అన్ని భాషల్లో విడుదల చేస్తాం. ఈ సినిమా నాలోని నటుడ్ని పరీక్ష పెట్టినట్టు అనిపించింది. చాలెంజింగ్‌గా అనిపించింది. 80, 90వ దశకంలో ఎలా ఉండేవారు.. ఎలా ప్రవర్తించేవారు.. ఎలా కనిపించాలి? ఇలా ప్రతీ ఒక్క అంశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. చిత్రలహరి నుంచి ప్రతీ పాత్రకు సంబంధించి నేను నోట్స్ రాసుకుంటూ వస్తూనే ఉన్నాను. (Sai Dharam Tej about Virupaksha)
జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి (Chiranjeevi)గారు ఓ కొటేషన్ పంపించారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ సిరివెన్నెల (Sirivennela)గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించారు’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!
*OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..
*Tollywood: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ దాడులు
*Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?
*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు