కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-08-09T15:20:20+05:30

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌‌ను నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా చిత్ర నిర్మాత.. బుధవారం మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Producer Anil Sunkara

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ (Meher Ramesh)ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌‌ను నిర్మించారు. చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్‌‌ని యమా జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం చిత్ర నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

మెగాస్టార్‌తో సినిమా చేయడమనేది ఎవరికైనా ఒక డ్రీమ్.. మీకెలా అనిపిస్తుంది?

నిజంగా ఊహించలేదు. కానీ ఇప్పుడది నెరవేరుతోంది. నేను వచ్చేటప్పటికే చిరంజీవిగారు రాజకీయాల్లో వున్నారు. అలాంటప్పుడు సినిమా అనే ఆలోచన రాదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వేడుక కోసం చిరంజీవిగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి వెళ్లాం. ఆయనని తొలిసారి కలిసింది అప్పుడే. సరదాగా మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నానండీ ఫైనల్‌గా కలిశాను’ అని అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ‘కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం’ అన్నారు. నా దగ్గర ‘వేదాళం’ (Vedalam) కన్నడ రైట్స్ వున్నాయి. రమేష్ గారు ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సమయంలో రోజూ కలసి చిరంజీవిగారికి ‘వేదాళం’ అయితే ఎలా వుంటుందని మాట్లాడేవాళ్ళం. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది.


చాలా మంది స్టార్స్‌తో సినిమాలు చేశారు కదా.. మెగాస్టార్‌తో చేయడం ఎలా అనిపించింది?

చిరంజీవిగారి అనుభవం మా అందరికీ కలిసొస్తుంది. ఆయన చాలా చురుగ్గా వుంటారు. మనతో మాట్లాడుతూనే.. సడన్‌గా షాట్ రెడీ అయ్యిందని వాళ్ళు రాకముందే తెలుసుకొని వెళ్ళిపోతారు. అటు వైపు ఎప్పుడు చూశారా? అని ఆశ్చర్యపోవడం మనవంతౌతుంది. ఆయన సమయపాలన అద్భుతం.

‘వేదాళం’ రీమేక్ ఏఎం రత్నం చేద్దామని అనుకున్నారు కదా..?

ఏఎం రత్నంగారు నాకు బాగా క్లోజ్. వేరే వాళ్లకి ఐతే ఇచ్చేవాళ్ళు కాదేమో. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో గొప్పగొప్ప సినిమాలు తీశారు. ఆయనని కలవడమే ఒక మంచి అనుభవం. మా మధ్య మంచి అనుబంధం వుంది. ‘వేదాళం’ మొదట హిందీలో చేయాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఆయనే చేస్తున్నారు. కన్నడలో ఓ స్టార్ హీరోతో చేద్దామని సన్నాహాలు చేస్తుండగా ఈలోగా చిరంజీవిగారు డేట్స్ ఇవ్వడంతో కన్నడని పోస్ట్ పోన్ చేసి ‘భోళా శంకర్’ చేశాం.

మెగాస్టార్‌తో సినిమా ఛాన్స్ వచ్చింది కదా.. యునిక్ సబ్జెక్ట్ కాకుండా రీమేక్ చేయడానికి కారణం?

‘భోళా శంకర్’ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్ వలనే మాకు చిరంజీవిగారి డేట్స్ వచ్చాయి.

మెగాస్టార్ ఈ సినిమా చేయడానికి మూలకారణం?

మెహర్ రమేష్‌గారు. ఆయనకి కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం. రెండేళ్ళ క్రితమే ఈ సబ్జెక్ట్ చిరంజీవిగారితో చెప్పారట. చిరంజీవిగారికి చాలా నచ్చింది.

వర్కింగ్ డేస్ తక్కువ అయినప్పటికీ.. ఈ సినిమా పూర్తి కావడానికి చాలా కాలం పట్టింది కదా?

కోవిడ్ ఒక కారణం. అలాగే చిరంజీవిగారి వేరే సినిమాలు కూడా జరిగాయి కదా.


దర్శకుడు మెహర్ రమేష్‌కి చాలా విరామం వచ్చింది కదా.. దాని ప్రభావం ఈ సినిమాపై ఏమైనా ఉంటుందా?

అలా ఏం వుండదండీ. పాత, కొత్త ఎఫెక్ట్‌లు వుండవు. ప్రజంట్ సినిమా ఎలా వచ్చిందనేది ముఖ్యం. నాకూ ‘సామజవరగమన’కి ముందు సినిమా ఇవ్వగానే ఒక ఎఫెక్ట్ వుండేది. ప్రతి సినిమా డిఫరెంట్. దేనికదే ప్రత్యేకం.

మీ సినిమాలకు అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు 40 శాతం ఎక్కువ అవుతుంది... కారణం ఏమిటి?

నా ఒక్కరిదే కాదండీ.. అన్ని సినిమాల బడ్జెట్‌లు ఎక్కువవుతున్నాయి. పదేళ్ళ ముందుకి ఇప్పటికీ అన్నీ పెరిగాయి. పదేళ్ళ నాటి కారు పేమెంట్ల, బత్తాలకి ఇప్పటికి చాలా తేడాలు వచ్చాయి. నాకు సినిమాపై పూర్తి అవగాహన వుంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను తగ్గించడానికే ప్రయత్నిస్తా. కానీ మనం అనుకున్నంత తేలిక కాదు. చాలా రకాలు వుంటాయి. అప్పటికి ఇప్పటికీ రెవెన్యూ స్ట్రీమ్స్ కూడా పెరిగాయి. దానికి తగ్గట్లు ఖర్చులు వుంటాయి.

నిర్మాతల గురించి మెగాస్టార్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. బడ్జెట్ కంట్రోల్‌పై ఆయనేమైనా సలహాలు ఇచ్చారా?

ఆయన కంట్రోల్ చేయమని చెబుతారు. ఎక్కువవుతుందని ఒక్క మాట చెబితే ఆయన చాలా బాగా ఇన్వాల్వ్ అయి ఎలా తగ్గించాలనేది చూస్తారు. బడ్జెట్ కంట్రోల్ విషయంలో ఆయనకి వున్న క్లారిటీ ఎవరికీ లేదు.

ఓపెనింగ్స్ విషయంలో ఎలా అనిపిస్తుంది?

మేము అనుకున్న ఓపెనింగ్స్ వస్తాయి. భోళా శంకర్ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అవుట్‌పుట్ పై చిరంజీవిగారు, మేము చాలా హ్యాపీగా వున్నాం. ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ అవుట్ అయిన ఫీలింగ్ వుంది. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్. అందరికీ కనెక్ట్ అవుతుంది.

కీర్తి సురేష్‌ (Keerthi Suresh)ని సిస్టర్ పాత్రలో తీసుకోవడానికి కారణం?

సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ వుండాలని ముందే నిర్ణయించుకున్నాం. నేను, మెహర్ రమేష్ చెన్నై‌లో కీర్తి సురేష్‌గారి ఇంటికి వెళ్లి కథ చెప్పి ఫైనలైజ్ చేసుకున్నాం. నా కెరీర్‌లో ఒకరి దగ్గరికి వెళ్లి డేట్స్ తీసుకోవడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఈ పాత్రకు ఆమె అంత ముఖ్యం. నేను సినిమా చూసిన తర్వాత.. చిరంజీవి‌గారు, కీర్తి సురేష్‌గారి మధ్య బాండింగ్ జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. కీర్తిని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేను.


మ్యూజిక్ బాధ్యతలు మహతి స్వర సాగర్‌ (Mahati Swara Sagar)కి ఇవ్వడానికి కారణం?

మహతి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. పెద్ద స్టార్ సినిమా ఇస్తేనే నెక్స్ట్ లెవల్‌కి వెళ్తారు. తమన్‌కి కూడా పెద్ద సినిమా ‘దూకుడు’. కొత్తవాళ్ళు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్‌గా ఎదిగితే ఇండస్ట్రీకి కూడా మంచి పరిణామం. మహతి చాలా మంచి పాటలు ఇచ్చాడు. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు.

షూటింగ్ గ్యాప్‌లో మెగాస్టార్‌ (Megastar)తో ఎలా ఉండేది?

మహేష్ బాబు‌గారితో సినిమా షూట్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు సెట్‌లో వుంటాను. నాకు, మహేష్‌గారికి మధ్య ఆ బాండింగ్ వుంటుంది. మిగతా సినిమా షూటింగులకు నేను ఉండను. ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. ‘ఒక హీరోగా చెబుతున్నా.. ప్రతిరోజు మీరు సెట్‌లో వుండాలి. నిర్మాత సెట్‌లో వుంటే చిరంజీవి గారు చాలా ఆనందపడతారు’ అని మహేష్ బాబు (Mahesh Babu)గారు చెప్పారు. 120 వర్కింగ్ డేస్‌లో దాదాపు 40 రోజులు చింజీవిగారితో వున్నాను. ఇది చాలా మెమరబుల్ జర్నీ. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. ఒక్క రోజు కూడా వృధా కాదు. చాలా ఎంజాయ్ చేశాను.

మొదటిసారి నిర్మాతల్లో మీ పేరు వేసుకున్నారు?

14 రీల్స్‌ (14 Reels)లో తీసే సినిమాలకి నా పేరు వుంటుంది. కానీ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాల్లో నిర్మాతగా ఎప్పుడూ మా నాన్నగారి పేరు(రామబ్రహ్మం సుంకర) వుంటుంది. కానీ ఈ సినిమాలో నా పేరు వుండాలని రమేష్‌గారు పట్టుపట్టారు. దీంతో నా పేరు కో ప్రొడ్యూసర్‌గా వేశాం. (నవ్వుతూ)

14 రీల్స్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి?

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) గారితో ఓ సినిమా చేస్తున్నాం.


ఇవి కూడా చదవండి:

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

*Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..

***************************************

*Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..

***************************************

*Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

***************************************

*Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

***************************************

Updated Date - 2023-08-09T15:20:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!