కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

ABN, First Publish Date - 2023-08-08T21:16:11+05:30

రీసెంట్‌గా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన వెబ్ సిరీస్ ‘దయా’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ సాధినేని చాలా సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ చేసిన ఈ వెబ్ సిరీస్‌ను ఎస్వీఎఫ్ ప్రొడక్షన్స్‌లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించారు.

Director Pavan Sadhineni

రీసెంట్‌గా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన వెబ్ సిరీస్ ‘దయా’ (Dayaa). డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ (Disney Plus HotStar)లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ చేసిన ఈ వెబ్ సిరీస్‌ను ఎస్వీఎఫ్ ప్రొడక్షన్స్‌లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించారు. 8 ఎపిసోడ్స్‌తో సీజన్ 1‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadhineni). ‘దయా’కు వస్తోన్న స్పందనతో హ్యాపీగా ఉన్న పవన్ సాధినేని.. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘‘దయా వెబ్ సిరీస్‌కు వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి మా వెబ్ సిరీస్ చూస్తున్నారు. ప్రతి చోట నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల చేసిన టూర్‌లోనూ ప్రతి ఏరియాలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. జేడీ చక్రవర్తి గారిని దయా అని పిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచైతే చాలా కాల్స్ మెసేజ్‌లు వస్తున్నాయి. బెంగాలీ వెబ్ సిరీస్ తక్ ధీర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ దయా కథ రాసుకున్నాను. అయితే ‘తక్ ధీర్’లో ఇంత విస్తృతమైన కథ ఉండదు. రిపోర్టర్, దయా అసిస్టెంట్ ఇలా..ఇన్ని క్యారెక్టర్స్ ఉండవు. ఆ వెబ్ సిరీస్ నుంచి కేవలం ఆంబులెన్స్ డ్రైవర్‌కు డెడ్ బాడీ దొరకడం అనే అంశాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా అంతా నేను రాసుకున్నదే. (Pavan Sadhineni about Dayaa Web Series)


జేడీ చక్రవర్తి (JD Chakravarthy)ని దయా పాత్ర కోసం సెలెక్ట్ చేయడం అది హాట్ స్టార్ యాజమాన్యం డిసిషన్. అయితే ఆయన నటుడితో పాటు దర్శకుడు కాబట్టి ఈ కథలో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడో అనుకున్నా. జేడీ ఈ వెబ్ సిరీస్‌కు నో చెప్పాలనే అనుకున్నాను. ఫోన్‌లో మాట్లాడిన తర్వాత నేను చేయబోయే సిరీస్ ఆయనకు అర్థమైంది. జేడీకున్న అనుభవానికి దర్శకుడి విజన్ తెలుసుకోగలరు. కథ పంపిస్తే ఆయన చదవకుండానే ఓకే చెప్పారు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు.

దయా సిరీస్‌లో మీరు చూసిందంతా ఒక గ్లింప్స్ మాత్రమే. దయా, అలివేలు క్యారెక్టర్స్ మెయిన్‌గా చూశారు. అసలైన కథ, ట్విస్ట్‌లు సెకండ్ సీజన్‌లో ఉంటాయి. ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు చాలా తక్కువ రిసోర్స్‌లతో చేశాం. ఇది క్లిక్ అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతాయి సెకండ్ సీజన్‌ను గ్రాండ్‌గా చేయవచ్చని ఆశించాం. మేము ఎక్స్‌పెక్ట్ చేసినట్లే ఫస్ట్ భాగం మంచి హిట్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్‌ను మరింత పెద్ద స్పాన్‌లో.. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చేయబోతున్నాం. (Pavan Sadhineni Happy with Dayaa Success)


ఈ వెబ్ సిరీస్ కథను సినిమాగా చేసినా ఇంత డీటెయిల్డ్‌గా, ఇన్ని క్యారెక్టర్‌లతో తెరకెక్కించడం సాధ్యం కాకపోయేది. వెబ్ సిరీస్ కాబట్టి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడా ఏ సీన్ కావాలని పెట్టింది కాదు. అన్నీ కథలోని ఇంటెన్సిటీని తెలిపేందుకే ఉపయోగించాం. కొన్ని సీన్స్ ఇబ్బందిగా ఉన్నాయని చెబుతున్నారు అయితే.. అవి ఆ పాత్రల యొక్క బాధను, స్ట్రగుల్‌ను చెప్పేందుకు మాత్రమే పెట్టాం. సిరీస్‌ను ఫ్లోలో చూస్తున్నప్పుడు ఎవరికీ ఇబ్బందిగా అనిపించదు.

Also Read: ‘దయా’ వెబ్ సిరీస్ రివ్యూ

దయా సీజన్ 1కు డబుల్ స్కేల్‌లో సీజన్ 2 ఉంటుంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. అన్నీ కుదిరాక వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇకపై సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. గీతా ఆర్ట్స్‌ (Geetha Arts)లో నేనొక సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నా. పెద్ద కాస్టింగ్‌తో ఆ సినిమా ఉంటుంది. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఆ సినిమాలో నాకు కావాల్సిన కాస్ట్ అండ్ క్రూ డేట్స్ కోసం వేచి చూస్తున్నా. ఇంతలో దయా ఆఫర్ వచ్చింది. అరవింద్ (Allu Aravind) గారికి చెబితే ఏప్రిల్ వరకు మన సినిమాకు టైమ్ ఉంది కదా ఈలోపు చేసుకుని వచ్చేయ్ అన్నారు. అలా దయా స్టార్ట్ చేశాం..’’ అని దర్శకుడు పవన్ సాధినేని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Guntur Kaaram: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. రివీలయ్యేది ఎప్పుడంటే?

***************************************

*Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

***************************************

*Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..

***************************************

*Pawan Kalyan: గుండెకు గొంతొస్తే.. బాధకి భాషొస్తే.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్


***************************************

*Upasana: ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఉపాసన సంచలన నిర్ణయం

***************************************

Updated Date - 2023-08-08T21:16:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!