Natural Star Nani: ‘హాయ్ నాన్న’.. స్పైసీ తర్వాత స్వీట్ క్రేవింగ్‌లాంటి సినిమా..
ABN, First Publish Date - 2023-12-06T22:55:45+05:30
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ‘హాయ్ నాన్న’ ఎమోషనల్ హై ఇచ్చే వెరీ హ్యాపీ ఫిల్మ్ అని అన్నారు న్యాచురల్ స్టార్ నాని.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించిన హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ (Shouryuv) దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా, శృతి హాసన్ (Shruti Haasan) కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా (Baby Kiara Khanna) మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు.. సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ఈ సినిమా విశేషాలను నాని మీడియాతో పంచుకున్నారు.
హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ని కలిశారు కదా..? ఏం మాట్లాడారు?
సరదాగా జనరల్ టాపిక్స్, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఒకసారి మనం ఇద్దరు కలసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తే బావుంటుందని ఫోన్ చేశారు. కానీ అది కుదరలేదు. అలాంటిది కుదిరితే చేద్దామని అనుకున్నాం. ఆయన ఇప్పటివరకు దాదాపు 136 సినిమాలు చేశారట. మా జనరేషన్‌లో అలాంటి నెంబర్ ని టచ్ చేయలేమని చెప్పాను.
‘హాయ్ నాన్న’ (Hi Nanna) విషయంలో చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నారు.. ఇందులో ఎమోషనల్ శాతం ఎక్కువగా వుంటుందా?
‘హాయ్ నాన్న’ చాలా హ్యాపీ ఫిల్మ్. ‘జెర్సీ’ చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఒక రకమైన ఎమోషన్ వుంటుంది. కానీ హాయ్ నాన్నకి మాత్రం ప్రేక్షకులు నవ్వులతో బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే ఎమోషన్ హై వుంటుంది.
దసరాతో మాస్ సినిమా చేశారు.. ఇప్పుడు మళ్ళీ మీ కంఫర్ట్ జోన్‌లో వచ్చినట్లు ఉన్నారు కదా?
లేదండీ. నాకు కంఫర్ట్ జోన్ అనేదే లేదు. ఎంటర్‌టైనర్స్, కామెడీ సినిమాలు చేసినప్పుడు అది కంఫర్ట్ జోన్ అన్నారు. తర్వాత జెర్సీ చేసినప్పుడు ఎమోషన్ నా కంఫర్ట్ జోన్ అన్నారు. తర్వాత దసరా లాంటి రా ఫిలిం చేశాను. నాకు కంఫర్ట్ జోన్ అనేది లేకుండా చేయడానికే నా ప్రయత్నం. (Natural Star Nani Interview)
దసరా తర్వాత మాస్ ఇమేజ్ వచ్చిందా కదా.. అటు వైపు కాకుండా మళ్ళీ ఇటు వైపు రావడానికి కారణం?
నేను ఇమేజ్ కోణంలో చూడను. కథ నచ్చిందనే దసరా చేశాను. కథ నచ్చిందనే ఇప్పుడు హాయ్ నాన్న చేశాను. దసరాని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు హాయ్ నాన్నని కూడా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులకు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. హాయ్ నాన్న అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. టార్గెట్ ఆడియన్స్‌కి ఇది ఫేవరేట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుంది.
హాయ్ నాన్న కథ విన్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
దర్శకుడు శౌర్యువ్ ఈ కథ చెప్పినప్పుడే చాలా హై ఇచ్చింది. యాక్షన్ సినిమాల్లో ఒకరకమైన ఎనర్జీ వుంటుంది. యానిమల్‌తో సహా ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైసీని పంచాయి. అయితే స్పైసీ తర్వాత స్వీట్ క్రేవింగ్ వుంటుంది. ఆ స్వీట్‌ని ఇచ్చే సినిమాలే లేవు. హాయ్ నాన్న ఆ లోటుని తీరుస్తుంది. ఈ ఏడాది అన్ని ఐటమ్స్ పెట్టారు కానీ ముగించే ఐటెం నేను పెడతా(నవ్వుతూ). (Natural Star Nani)
‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్‌ని చాలా అగ్రెసివ్‌గా చేసినట్లు కనిపిస్తోంది?
మంచి సినిమా చేయడమే కాదు దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళాలి. ‘సినిమా బావుండాలి.. మనం చెప్పగానే చూసేస్తారా’ అనే ఆలోచన వుండేది. కానీ దసరాతో అది మారింది. సినిమా బావుండటంతో పాటు మనవంతుగా ఆ సినిమా గురించి చెప్పాలి. సినిమా పేరు నానుతూవుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతుందని ఆలోచన మొదలైంది. దసరాతో అది ప్రూవ్ అయ్యింది. హాయ్ నాన్న లాంటి బ్యూటీఫుల్ సినిమాకి ఇంకా అగ్రెసివ్‌గా చేయాలని భావించాం.
హాయ్ నాన్నపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు?
అది ‘హాయ్ నాన్న’ కంటెంట్ ఇచ్చిన నమ్మకం. ఏదైనా సినిమాని చూసినప్పుడు అది నచ్చితే మొదట సోషల్ మీడియాలో సినిమాని అభినందిస్తూ పోస్ట్ పెడతాను. తాజాగా వచ్చిన యానిమల్ కూడా అలా చేశాను. అది ఒక ప్రేక్షకుడిగా నా అనుభూతి. ‘హాయ్ నాన్న’ని ఒక ప్రేక్షకుడిగా చూసినప్పుడు అదే గొప్ప అనుభూతి కలిగింది. అదే ఈ నమ్మకాన్ని ఇచ్చింది.
యానిమల్ టాపిక్ వచ్చింది కాబట్టి.. అలాంటి కథ వస్తే అంగీకరిస్తారా?
వందశాతం. దసరా లాంటి కథలో నన్ను వూహించుకున్నారా?..చేస్తే గానీ ఊహించలేం. బహుశా అంత కంటే మ్యాడ్నెస్ వున్న పాత్రలు చేస్తానేమో చెప్పలేం. అలాంటి సవాల్‌తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినపుడు వాటిని చేయడానికే ఇష్టపడతాను.
ప్రమోషన్స్‌లో భాగంగా ఒక పొలిటీషియన్‌ని ఇమిటేట్ చేశారు కదా.. అది ఎవరి ఆలోచన?
సరదాగా టీం అంతా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎన్నికల టాపిక్‌లో సినిమా టాపిక్ ఉంటుందా అనే ప్రశ్న వేసుకున్నపుడు వుండదని ఆన్సర్ వచ్చింది. అలాంటప్పుడు ఆ టాపిక్‌లోకి మనం దూరిపోదామనే ఆలోచన చేశాం. (నవ్వుతూ) అలా హాయ్ నాన్న మ్యానిఫెస్టో చేశాం. అది చాలా బాగా వైరల్ అయ్యింది.
‘హాయ్ నాన్న’కి ఏ ఐ లో మ్యూజిక్ క్రియేట్ చేశారట?
లేదండీ. అది కంప్లీట్‌గా మిస్టేక్. ఒక చోట హమ్మింగ్‌కి హేషం వాయిస్‌ని అమ్మాయి వాయిస్‌గా ఏఐ ని వాడి మార్చాడు. అంతే.
హేషం ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?
టీం అంతా కలసి తను పర్ఫెక్ట్ అనుకున్నాం. తనకి 90లలో రెహ్మాన్ ఫ్లేవర్ వుంటుంది. ఇలాంటి లవ్ స్టొరీకి హేషమ్ లాంటి ఫ్లేవర్ చక్కగా కుదురుతుందని ఆయన్ని ఎంపిక చేశారు. పాటలకు అద్బుతమైన స్పందన వచ్చింది. నేపధ్య సంగీతం కూడా ఎక్స్ ట్రార్డినరీ గా చేశాడు.
సాను జాన్ వర్గీస్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
సాను జాన్ వర్గీస్ నా ఫేవరేట్ డీవోపీ. కథ కోసం పని చేసే టెక్నిషియన్ తను. బ్రిలియంట్ కెమెరామ్యాన్. తను తెలుగులో చేసిన మూడు సినిమాలు నావే కావడం ఆనందంగా వుంది.
మృణాల్ ఠాకూర్ గురించి?
యశ్న పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించింది. తన పెర్ఫార్మెన్స్ కట్టిపడేస్తుంది.
బేబీ కియారా గురించి?
తను సూపర్ కిడ్. తనది బ్రిలియంట్ మెమరీ. మా డైలాగులు కూడా చెప్పేస్తుంది. తన నటన మనసుని హత్తుకునేలా వుంటుంది..
ప్రేక్షకులు మీ సినిమాకి వచ్చేటప్పటికీ చాలా నమ్మకంతో వస్తారు.. అంత స్థిరంగా ఆ నమ్మకాన్ని నిలబట్టుకోవడానికి ఎలాంటి కసరత్తులు చేస్తారు?
నా మనసుని ఫాలో అవుతాను. దానిని ఫాలో ఐతే పెద్ద తప్పులు జరగవని నా ఫీలింగ్. మనసుకు నచ్చినది చేయడంలో నిజాయితీ వుంటుంది.
ఇందులో శ్రుతి హాసన్ పాత్ర ఎలా వుండబోతుంది?
ముందునుంచి చెబుతున్నా కదా.. తను పాటలో మాత్రమే వుంటుంది
పాప తల్లి శ్రుతి హాసన్ అనుకుంటున్నారు?
అలా ఎందుకు అనుకుంటున్నారు (నవ్వుతూ). కొన్ని గెస్ట్ ఎప్పిరియన్స్‌లు, సర్ ప్రైజ్ పాత్రలు వున్నాయి.
‘నాని లీక్స్’గా ఏదైనా లీక్ చేయచ్చు కదా?
‘హాయ్ నాన్న’ ఇంటర్వెల్ కి ఇంటర్మిషన్ అని వుండదు.. హాయ్ అని వస్తుంది(నవ్వుతూ)
వైర ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇది తొలి చిత్రం కదా.. ప్రమోషన్స్ అన్నీ మీరే చూసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది?
నటుడిగా నేనే చేయాలి. ఇది వాళ్ళకి మొదటి సినిమా. ఎన్నో విషయాలని అర్థం చేసుకోవాలి. గైడెన్స్ అవసరం. ఇన్నేళ్ళుగా ఇక్కడ వున్నాను కాబట్టి నా వంతుగా కొంత గైడెన్స్.. అంతే.
మీకు ఫ్యామిలీ హీరో ట్యాగ్ లైన్ వుంది కదా... దాన్ని ఎలా చూస్తారు?
ఎవరైనా ఫ్యామిలీ హీరో అన్నప్పుడు ఆనందంగా వుంటుంది. వెంకటేష్ గారితో మాట్లాడుతున్నపుడు కూడా ఇదే టాపిక్ వచ్చింది. ఆయన తర్వాత ఫ్యామిలీ హీరోగా నన్ను చూస్తారని చెప్పారు. అయితే నేను అన్ని రకాల చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. ఒక్క ఇమేజ్‌లోనే వుండిపోకుండా కొత్తదారుల్లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తాను.
దిల్ రాజుగారు, బలగం వేణుతో యల్లమ్మ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారా?
ప్రస్తుతానికైతే ఏం లేదు. అయితే దిల్ రాజు గారు, వేణు నాతో వర్క్ చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. వేణు చాలా ప్రతిభ గల దర్శకుడు. బలగం చూసిన తర్వాత తనలో ఇంత ప్రతిభ ఉందా అని అనుకున్నాను. తను వచ్చి నాకు కథ చెబితే ఐయామ్ వెరీ హ్యాపీ.
హిట్ 3 గురించి?
హిట్ యూనివర్స్‌లో ప్రతి ఆలోచన నా దగ్గరకే ముందు వస్తుంది. కథ జరుగుతోంది. వర్క్ పూర్తయిన వెంటనే మొదలుపెడతాం.
ఇవి కూడా చదవండి:
====================
*Naa Saami Ranga: నాగ్ ఎత్తికెళ్లిపోతాడంట.. జర జాగ్రత్త!
********************************
*Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్
**********************************
*B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?
**************************************