సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thaman S: ట్రోల్స్‌పై సంగీత దర్శకుడు థమన్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-07-10T23:25:51+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలైన నేపథ్యంలో థమన్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు.

Music Director S Thaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలయికలో పి. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘మై డియర్ మార్కండేయ’ అనే పాట విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాకు థమన్ ‘బ్రో’ చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం.. ఎలా అనిపిస్తుంది?

ఎవరెస్ట్‌ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్ కళ్యాణ్‌గారితో మూడు సినిమాలూ రీమేక్‌లే వచ్చాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఈ మూడు సంగీతం పరంగా నేను చేయాల్సింది చేస్తున్నాను. సాంగ్స్ సినిమాకి హెల్ప్ చేస్తాయి. వకీల్ సాబ్‌లో ‘మగువ మగువ’ వంటి పాటని కూడా మాసీగా ఫైట్‌కి ఉపయోగించాం. ‘బ్రో’ అనే సినిమా విడుదలయ్యాక ఎంతోమందిని కదిలిస్తుంది. హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. త్రివిక్రమ్‌గారి రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక పవన్ కళ్యాణ్‌గారు ఉన్నారంటే సహజంగానే సినిమా స్థాయి పెరుగుతుంది.


మాతృక ప్రభావం మ్యూజిక్‌పై కూడా ఉంటుందా?

ఒరిజినల్ ఫిల్మ్‌లో పాటల్లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగా చేశారు. అక్కడ ఆ పాత్ర సముద్రఖని‌గారు చేశారు కాబట్టి అది సరిపోతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆయన తెర మీద కనిపిస్తే చాలు సంగీతం అడిగేస్తాం. అందుకే బ్రో శ్లోకం స్వరపరిచాం. నేపథ్య సంగీతం పరంగా అయితే చాలా సంతోషంగా ఉన్నాను. కచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. (S Thaman about Bro Movie)

మేనమామ, మేనల్లుడు కలయిక.. ఏమైనా ఛాలెంజింగ్‌గా అనిపించిందా?

ఆ పాటను మాస్‌గా చేయలేము. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేము. ఇది అలాంటి సినిమా కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. కాలం ఎంత ముఖ్యం అనే దానిపై ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నాం. త్వరలో తేజ్ డ్యూయట్ సాంగ్ ఒకటి రానుంది. అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా క్లైమాక్స్‌లో ఒక మాంటేజ్ సాంగ్‌కి సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా సర్‌ప్రైజ్ లు ఉన్నాయి.

ఈ సినిమా విషయంలో మీరు సలహాలు ఏమైనా ఇచ్చారా?

లేదండీ. ఇది మనం ఊహించే దానికంటే పెద్ద సినిమా. త్రివిక్రమ్ గారు స్క్రీన్‌ప్లే రాసి చెప్పినప్పుడే అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సినిమా అందరికీ కదిలిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. జీవితం అంటే ఏంటో తెలిపేలా ఉంటుంది. సున్నితమైన అంశాలు ఉంటాయి. తేజ్ కొన్ని కొన్ని సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కళ్యాణ్ గారు, తేజ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో అది మనకు తెర మీద కనిపిస్తుంది. (S Thaman Interview)

పవన్ కళ్యాణ్ గెటప్ గురించి..?

మీరు సినిమా చూడండి. ప్రతి సన్నివేశం నచ్చుతుంది. పవన్ కళ్యాణ్‌గారు చాలా బాగా చేశారు. చాలారోజుల తర్వాత నేను వేరే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను ఈ సినిమాలో. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం.

ఈ సినిమాకి మీ సంగీతం ఎలా ఉండబోతుంది?

భీమ్లా నాయక్ తరహాలో ‘బ్రో’ సినిమాలో మాస్ పాటలు ఉండవు. సినిమాకి ఎలాంటి పాటలు అవసరమో అలాంటి పాటలు స్వరపరుస్తాను. సంగీతమైనా, సాహిత్యమైనా సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగానే ఉంటాయి. సముద్రఖని గారు, త్రివిక్రమ్ గారు లాంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ కథలో ఏం కావాలో, ఎలాంటి పాట రావాలో వారికి తెలుసు. దానికి తగ్గట్టుగానే పాటలు ఉంటాయి. బ్రో సినిమాలో పాటల్లోనూ, నేపథ్య సంగీతంలోనూ కొత్తదనం కనిపిస్తుంది. దర్శకనిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్రం చూసి నేపథ్య సంగీతానికి కంటతడి పెట్టుకున్నారు. మేమందరం సినిమా పట్ల, సంగీతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.


సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని పట్టించుకుంటారా?

ట్రోల్స్ చూస్తుంటే ఉంటాను. అందులో మంచిని తీసుకుంటాను, చెడుని పక్కన పెట్టేస్తాను. ప్రశంసలు తీసుకున్నప్పుడు, విమర్శలు కూడా తీసుకోగలగాలి. నేను సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో, సంగీతం కోసం ఎంతో కష్టపడతానో మా దర్శక నిర్మాతలకు తెలుసు. కొందరేదో కావాలని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా సాధ్యం..?

నేను ఈ స్థాయికి రావడానికి 25 ఏళ్ళు పట్టింది. నేర్చుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం నేర్చుకున్నాను. 2013-14 సమయంలోనే ఒకే ఏడాది నేను పని చేసిన పదికి పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా, నా వల్ల ఎప్పుడూ ఆలస్యం అవ్వదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి సమయానికి సంగీతం పూర్తి చేస్తాను.

సముద్రఖని గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

ఫస్టాఫ్ సినిమా చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడని అందరికీ చెప్పేశారు. ఒక దర్శకుడు కన్నీళ్లు పెట్టుకోవడం నేను మొదటిసారి చూశాను. సినిమాలో అలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం చాలా కష్టం. ఆ ఎమోషన్స్‌కి తగ్గట్టుగా చేయాలి. (Music Director S Thaman)

ఇవి కూడా చదవండి:

**************************************

*Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో

**************************************

*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..

**************************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?

**************************************

*Deen Raj: ఎన్నో క‌ష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం

**************************************

*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..

**************************************

Updated Date - 2023-07-10T23:25:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!