కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

ABN, First Publish Date - 2023-12-10T13:07:32+05:30

ఆమె అందానికి మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ కిరీటాలు దాసోహం అయ్యాయి. ఇప్పుడిక నటనలోనూ తానేంటో నిరూపించుకోవాలని చూస్తోంది మానుషి చిల్లర్‌. ఇప్పటికే ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ... ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో టాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన గురించి తన తాజాగా ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చింది.

Manushi Chhillar

ఆమె అందానికి మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ కిరీటాలు దాసోహం అయ్యాయి. ఇప్పుడిక నటనలోనూ తానేంటో నిరూపించుకోవాలని చూస్తోంది మానుషి చిల్లర్‌ (Manushi Chhillar). ఇప్పటికే ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ... ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో టాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన గురించి పంచుకున్న కబుర్లివి...

బ్యూటీ సీక్రెట్‌

అందాల పోటీలకు సన్నద్ధమవుతున్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టా. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు వ్యాయామంతో పాటు, సరైన డైట్‌ కూడా పాటిస్తుంటా. స్ట్రీట్‌ ఫుడ్‌ జోలికి అస్సలు పోను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజూ స్వయంగా నేనే వండుకొని తింటా. కొన్ని బ్యూటీ టిప్స్‌ కూడా పాటిస్తా. ‘ఎస్టీ లాడర్‌ నైట్‌ సీరమ్‌’ నా ఫేవరెట్‌. ఒకసారి నా హెయిర్‌ స్టైలిస్ట్‌ దీన్ని రికమెండ్‌ చేశారు. ఇది నా చర్మంపై అద్భుతంగా పనిచేసింది. అప్పటి నుంచి ఈ సీరమ్‌ నా హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉండాల్సిందే.


ఆత్మవిశ్వాసం ముఖ్యం

అందాల పోటీల్లో పాల్గొనాలనుకునేవారికి రకరకాల భయాలుంటాయి. అలాంటి వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే... ఎలాంటి సందర్భంలోనైనా ప్రశాంతంగా కనిపించాలి. మీకంటూ సొంత వ్యక్తిత్వం ఉండాలి. అలాగే ధరించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండడం ముఖ్యం. అన్నింటికన్నా మీపై మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి.

నా వంతు కృషి

సమాజంలోని రకరకాల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నావంతు కృషి చేస్తుంటా. రుతుస్రావం సమయంలో అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడకం తదితర అంశాల పట్ల ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు అవగాహన కల్పించా. ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది అమ్మాయిలకు రుతు సంబంధ సమస్యలపై సరైన అవగాహన లేదు. ఇప్పటికీ దాని గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు. అది సాధారణమైనదనే విషయాన్ని ఆడపిల్లలు గుర్తించాలి. అప్పుడే ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. (Manushi Chhillar Interview)

అత్యుత్తమ దర్శకుడాయన...

నాకు డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli) అంటే ఇష్టం. ఆయన అత్యుత్తమ దర్శకుడు. ఆయన తీసిన ‘మగధీర’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాకు భలే నచ్చాయి. వాటిని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. మహిళల పాత్రల్ని తెరపై చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారాయన. రాజమౌళి సినిమాల్లో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నా.

ప్రయాణాలంటే పిచ్చి

నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. అలాగని సోలోగా ప్రయాణించాలంటే మాత్రం బోర్‌. ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే.. నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని నచ్చిన ప్రదేశాలన్నీ చుట్టొస్తా. చిన్నప్పుడైతే కుటుంబమంతా కలసి ఏడాదికి కనీసం ఒకట్రెండు ట్రిప్పులకైనా వెళ్లేవాళ్లం. ఇప్పుడు అంత తీరిక దొరకట్లేదని బాధేస్తుంటుంది. నేను ఎక్కువగా చారిత్రక ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతా. షాపింగ్‌ అంటే మాత్రం ఠక్కున గుర్తొచ్చేది ప్యారిస్‌.


అందాల పోటీల నుంచి...

నేను పుట్టింది హర్యానాలోనైనా, పెరిగింది ఢిల్లీలో. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందుండేదాన్ని. ఇంటర్‌ పూర్తయ్యాక.. నా తల్లిదండ్రుల్లాగే నేను కూడా వైద్యురాలిగా స్థిరపడాలనుకున్నా. సోనీపట్‌లోని భగత్‌ పూల్‌సింగ్‌ మెడికల్‌ కాలేజీలో చేరా. కాలేజీ క్యాంపస్‌లో జరిగిన అందాల పోటీలో పాల్గొని ‘మిస్‌ క్యాంపస్‌ ప్రిన్సెస్‌’ కిరీటాన్ని దక్కించుకున్నా. ఎంబీబీఎస్‌ రెండో ఏడాదిలో ఉండగానే ‘2017 మిస్‌ ఇండియా’గా నిలిచా. ఆ వెంటనే మిస్‌వరల్డ్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని దక్కించుకున్నా. దాంతో బాలీవుడ్‌ అవకాశాలు క్యూ కట్టాయి. మొదట చాలా సినిమాలు తిరస్కరించా. ఆ తర్వాత కథ నచ్చడంతో ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’కు ఓకే చెప్పేశా. అందులో అక్షయ్‌ కుమార్‌ హీరో అని తెలియగానే ఎగిరి గంతేశా. టాలీవుడ్‌లోనూ ఓ మంచి పాత్రతో పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా.. (Miss World Manushi Chhillar)


ఇవి కూడా చదవండి:

====================

*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

*************************************

*Guntur Kaaram: మహేష్‌కి ముద్దు.. సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైనట్లే..

*********************************

*Director Sai Kiran Daida: స్క్రీన్‌కి అతుక్కొని మరీ ‘పిండం’ సినిమా చూస్తారు..

********************************

*Thandel: నాగ్ స్విచ్.. వెంకీ క్లాప్.. అరవింద్ స్క్రిఫ్ట్

***********************************

Updated Date - 2023-12-10T13:07:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!