Khushi: పీసీ శ్రీరామ్ చూపించే బ్యూటీ లా ఉంటుంది ఇందులో, కానీ మేము కాపీ కొట్టలేదు: సినిమాటోగ్రాఫర్ జి మురళి
ABN, First Publish Date - 2023-08-24T13:20:37+05:30
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ మూవీ అన్ని భాషల్లో విడుదలకి సిద్ధం అయింది. దీనికి దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం చేశారు. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు పనిచేసిన అనుభవాలు తెలిపారు సినిమాటోగ్రాఫర్ జి మురళి.
మురళి పుట్టి పెరిగింది తమిళ నాడులో అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్, పెయింటింగ్, సోషల్ ఇష్యూస్, పాలిటిక్స్ మీద ఆసక్తి ఉండేది. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ లో కూడా పనిచేశాను అని చెప్పారు మురళి. కానీ సినిమా పరిశ్రమ వైపు రావాలనే ఆసక్తి కలిగి ఇటు వైపు వచ్చాను అని చెప్పాడు. అలాగే జీవితంలో ఎక్కువగా ఊహించుకోవడం కంటే వాస్తవిక జీవితంలో ఉండటానికి ఇష్టపడతాను అంటున్నారు. అందుకనే నేను సినిమాటోగ్రఫీ చేసే సినిమాలు కూడా అలా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పారు మురళి (CinimatographerMurali).
అతను అనుభవం గురించి చెపుతూ, 2005 నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో పని చేస్తున్నట్టుగా చెపుతూ, 'అందాల రాక్షసి' సినిమాకి పని చేసాను అని చెప్పారు. ఆ తర్వాత ఒక మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసిన సినిమా ఈ ‘ఖుషి’ #Khushi నే అని చెప్తున్నారు. మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాం, కథ వినండి అని చెప్పారు. (MythriMovieMakers) అలా శివ (ShivaNirvana) గారు కథ చెప్పారు బాగా నచ్చింది. ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఈ సినిమా చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీలయ్యా అని చెప్పారు మురళి.
సినిమా గురించి మాట్లాడుతూ, ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ఈ సినిమా నేపథ్యం. మణిరత్నం (ManiRatnam) సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PCSreeram) చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా మా సినిమాల్లో విజువల్స్ ఉంటాయి అని అన్నారు.
దర్శకుడు గురించి మాట్లాడుతూ , శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అలాగే అతనికి సినిమా మేకింగ్ మీద చాలా ఇష్టం, సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం అని చెప్పారు.
సినిమాలో లీడ్ పెయిర్ గురించి మాట్లాడుతూ ఇందులో విప్లవ్, ఆరాధ్య పాత్రలలో విజయ్ (VijayDeverakonda), సమంత (Samantha) నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాళ్ల క్యారెక్టర్స్ మధ్య వచ్చే సందర్భాల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్, డీటెయిల్స్ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చాయి. క్యారెక్టర్ లో ఎంతవరకు నటించాలో విజయ్ కు బాగా తెలుసు. ‘ఖుషి’లో అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి పనిచేశాను అని చెప్పారు.
నేను పనిచేసిన గత చిత్రాలు 'కాలా', 'సార్పట్ట' వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను అని చెప్పారు మురళి.