కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kajal Aggarwal: హైదరాబాదుకి మకాం మార్చిన 'సత్యభామ'

ABN, First Publish Date - 2023-11-29T10:48:28+05:30

కాజల్ అగర్వాల్ తన 60వ సినిమా 'సత్యభామ' గా చేస్తోంది. ఇందులో ఆమె ఒక పోలీసాఫీసర్ గా కనపడనుంది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందినట్టుగా చెప్పింది, అలాగే ఇలాంటి పాత్రలకు పేరు పొందిన విజయశాంతిని స్ఫూర్తిగా కూడా తీసుకుని చేస్తున్నాను అని చెప్పారు కాజల్.

Kajal Aggarwal as Satyabhama

ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలు చేసిన చాలామంది నటీమణులు ముంబై నుండి హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయిన వాళ్ల చాలామంది వున్నారు. కొంతమంది మాత్రం ముంబైలోనే ఉంటూ అక్కడి నుండే తిరుగుతూ కూడా వున్నారు, అలంటి వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే పెళ్లయి, పిల్లవాడు పుట్టాక కాజల్ తన మకాం ఇప్పుడు హైదారాబాదు కి పూర్తిగా మార్చేసేను అని, ఇప్పుడు పూర్తిగా హైదరాబాదు నుండే పని చేస్తున్నానని అని చెప్పారు. (Kajal Aggarwal completely shifted to Hyderabad and now working from here)

"మా అబ్బాయిని ఎక్కువగా మిస్ అవటం నాకిష్టం లేదు. అందుకనే నేను వాడికోసం హైదరాబాదు వచ్చేసాను, ఇక్కడే వుంటాను ఇక. ఇక్కడినుండి షూటింగ్ లకు వెళుతూ వుంటాను. మా అబ్బాయిని కూడా ఇక్కడ ఒక ప్లే స్కూల్ లో జాయిన్ చేసాను కూడా," అని చెప్పారు కాజల్ అగర్వాల్. ఆమె ఇప్పుడు 'సత్యభామ' #SatyaBhama సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఇందులో ఆమె ఒక పోలీసాఫీసర్ గా చేస్తున్నాను అని చెప్పారు.

తెలుగులో పోలీసు అనగానే విజయశాంతి అందరికీ గుర్తుకు వస్తారు కదా అని అడిగితే, అవును అని సమాధానం చెప్పారు కాజల్. "నేను విజయశాంతి మేడం గురించి విన్నాను, ఆమె సినిమాలు కూడా చూసాను, ఆమె స్ఫూర్తితోటే ఈ సినిమా చేస్తున్నాను," అని చెప్పారు కాజల్ అగర్వాల్. ఈ సినిమా వొప్పుకోవటానికి వున్న నేపధ్యం కూడా చెప్పుకు వచ్చారు కాజల్. నేను "నేను 'మేజర్' సినిమా చూసేటప్పుడు, ఆ సినిమా చాలా నచ్చి, ఆ సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా (Sasikiran Thikka) తో పని చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. వెంటనే అతనే ఈ కథ పట్టుకొని నా దగ్గరకి వచ్చారు, కథ విన్నాక వెంటనే అంగీకరించాను," అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి శశికిరణ్ కథతో పాటు క్రియేటివ్ దర్శకుడిగా పనిచేస్తున్నారు, సుమన్ చిక్కాల దర్శకత్వం చేస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు.

ఈ 'సత్యభామ' లో చాలా డ్రామా ఉంటుందని చెప్పారు కాజల్ అగర్వాల్. "ఇందులో నేను చాలా పోరాట సన్నివేశాలను కూడా చేస్తున్నాను. అందుకు మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ (Mixed Martial Arts) ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అలాగే దర్శకుడు శంకర్ తో చేస్తున్న 'భారతీయుడు 2' సినిమాలో కూడా పోరాట సన్నివేశాలకు ట్రైనింగ్ తీసుకున్నాను, అవన్నీ ఈ సినిమాకి ఉపయోగపడుతున్నాయి," అని చెప్పారు కాజల్. ఈ సినిమాలో కాజల్ కి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు అని చెప్పారు. "అతను ఒక ఆథర్, కథలు రాస్తుంటాడు," అని చెప్పారు. నవీన్ చంద్ర చేస్తున్నారు కాజల్ బాయ్ ఫ్రెండ్ గా ఈ సినిమాలో. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

-- సురేష్ కవిరాయని

Updated Date - 2023-11-29T10:49:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!