కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venu Thottempudi: 'అతడు'లో సోను సూద్ పాత్ర నేను చెయ్యాల్సింది

ABN, First Publish Date - 2023-09-20T16:25:16+05:30

'చిరునవ్వుతో' సినిమా అందరికీ గుర్తుందా, అందులో చక్కగా నవ్వుతూ కనిపించే కథానాయకుడు తొట్టెంపూడి వేణు. ఆ తరువాత చాలా సినిమాలు చేసినా, ఈమధ్య పరిశ్రమకి దూరం అయ్యాడు. ఇప్పుడు 'అతిధి' అనే వెబ్ సిరీస్ తో వచ్చాడు. ఆ వెబ్ సిరీస్ గురించి, అలాగే తాను చెయ్యబోయే సినిమాలు గురించి...

Venu Thootempudi

వేణు తొట్టెంపూడి (VenuThottempudi), అవంతిక మిశ్రా (AvantikaMisra) లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ 'అతిథి' #Athidhi. ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు భరత్ వైజీ (BharathYG), ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు (PraveenSattaru) ఈ వెబ్ సిరీస్ షో రన్నర్ గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ లో నటించిన తన అనుభవాలు చెప్పారు వేణు.

ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అని వేణు ని అడిగినప్పుడు, మంచి రెస్పాన్స్ వస్తోంది. కొందరు క్లాసీగా ఉందని, మరికొందరు మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. నన్ను అడిగితే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లాంటిది. ఇందులో కామెడీ, సస్పెన్స్, డ్రామా, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్ తక్కువ. అందుకే ఫ్యామిలీ ఆడియెన్ అంతా కలిసి హాయిగా చూడొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వెబ్ సిరీస్ చెయ్యాలని ఎందుకు అనిపించింది అని అడిగితే, లాక్ డౌన్ టైమ్ లో వెబ్ సిరీస్ లు చాలా చూశాను. ఆ టైమ్ లో నేను కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నేను అనుకున్నట్లే ఈ వెబ్ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 'అతిథి' గురించి చెప్పారు. ఆ తర్వాత స్క్రిప్ట్ నా దగ్గరకు పంపించారు. ఈ కథ నాకు బాగా నచ్చింది, అలాగే దర్శకుడు భరత్ కూడా ఈ సబ్జెక్ట్ చేస్తే నాకు బాగుంటుంది అన్నాడు. నన్ను నమ్మి ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలని అనిపించింది. కథ కూడా బాగా ఇంప్రెస్ చేసింది. దాంతో ఈ వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకున్నా అని చెప్పారు వేణు.

మొదటిసారిగా ఒక హర్రర్ కంటెంట్ నటించాను అని చెప్పారు వేణు. ఈ వెబ్ సిరీస్ లో నేను చేసిన రవివర్మ క్యారెక్టర్ పర్ ఫార్మెన్స్ చేసేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఈ కథలో అతనికి అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్లు ఉండాలి. ఎక్కువ, తక్కువ కాకుండా బ్యాలెన్స్ గా ఉండాలి. మిగతా క్యారెక్టర్స్ కు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. నాకు మాత్రం డబ్బాలో పెట్టినట్లు బిగించారు. దర్శకుడు భరత్ ఈ కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మీరు సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చేయాలి చెప్పాడు. మా పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొస్తుందంటే ఆ క్రెడిట్ భరత్ కే ఇవ్వాలి.

చాలా కాలం తరువాత ఇలా వెబ్ సిరీస్ లో కనపడ్డ వేణు, మళ్ళీ సినిమాలు వరసగా చేసుకుంటూ వెళతారా అని అడిగితే, సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ గా సినిమాలు చేయాలనే కోరిక లేదు. మంచి సబ్జెక్ట్ చేయాలి. నటుడిగా నా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే నటుడిగా నా బెస్ట్ పర్ ఫార్మెన్స్ చేసే కథ ఇంకా దొరకలేదు. నాగార్జున గారి 'అన్నమయ్య', చిరంజీవి గారి కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ మనం తప్పకుండా చేయాలని అనిపిస్తుంటుంది. మహేష్ బాబు (MaheshBabu) నటించిన, 'అతడు' #Athadu సినిమాలో సోనూ సూద్ (SonuSood) క్యారెక్టర్ లో నేనే నటించాలి. అయితే వేరియస్ రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను. అలాగే 'దేశముదురు' #Desamuduru సినిమా కూడా చేయలేకపోయా. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ నా కెరీర్ లో మిస్ అయినందుకు ఏమీ బాధపడటం లేదు. ఇదొక సముద్రం, అలలు వస్తుంటాయి, కొన్నిసార్లు సునామీలు కూడా వస్తాయి. ప్రస్తుతం ఛాయ్ బిస్కెట్ వాళ్లకు ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. సూర్య అని కొత్త దర్శకుడు. చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది.

Updated Date - 2023-09-20T16:26:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!