Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..
ABN, First Publish Date - 2023-05-15T13:15:49+05:30
తెలుగుతెరపైకి ‘ఉప్పెన’ (Uppena)లా దూసుకొచ్చి, తన అందంతో కుర్రకారు గుండెల్లో సునామీ సృష్టించింది కృతి శెట్టి (Krithi Shetty). తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారి
తెలుగుతెరపైకి ‘ఉప్పెన’ (Uppena)లా దూసుకొచ్చి, తన అందంతో కుర్రకారు గుండెల్లో సునామీ సృష్టించింది కృతి శెట్టి (Krithi Shetty). తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారి, వరుస సినిమాలతో బుల్లెట్ బండిలా దూసుకుపోతోంది. తాజాగా ‘కస్టడీ’ (Custody)లో కనిపించిన ఈ బేబమ్మ పంచుకున్న ముచ్చట్లివి...
సింపుల్‌గా...
నాకు కాబోయేవాడు చాలా సింపుల్‌గా, నిజాయితీగా ఉండాలి. కాస్త బొద్దుగా కూడా ఉండాలి. ఇంట్లోవాళ్లు నన్ను ముద్దుగా ‘బుంగి’ (Bungi) అని పిలుస్తుంటారు. ‘బంగార్రాజు’ (Bangarraju)లో నేను పోషించిన పాత్రంటే మా నాన్నకు ఎంతో ఇష్టం.
శివ కార్తికేయన్ (Siva Karthikeyan) అభిమానిని...
హీరోలలో శివకార్తికేయన్, రామ్‌చరణ్ (Ram Charan) అంటే ఇష్టం. ఈ మధ్యకాలంలో తమిళం నేర్చుకునేందుకు వరుసగా తమిళ సినిమాలు చూస్తున్నా. ఈ క్రమంలో శివ కార్తికేయన్ నటనకు ఫిదా అయిపోయా. ఆలియా భట్ (Alia Bhatt) నాకు స్ఫూర్తి. ఆమె స్టోరీ సెలెక్షన్ బాగా నచ్చుతుంది. ఏ పాత్రలోనైనా సహజంగా ఒదిగిపోతుంది.
హృతిక్‌తో నటించా...
ఆరో తరగతిలో ఉన్నప్పుడే యాడ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువుకుంటూనే ప్రకటనలు చేసేదాన్ని. ఇంటర్‌లో ఉన్నప్పుడు యాక్టింగ్‌కు సంబంధించిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్నా. అప్పుడే హృతిక్‌రోషన్ ‘సూపర్ 30’ (Super 30)లో నటించే అవకాశం వచ్చింది. అందులో స్టూడెంట్‌గా చిన్న పాత్ర చేశా. సోషల్ మీడియాలో నా ఫొటోలను చూసి, ఆడిషన్ చేసి ‘ఉప్పెన’లో ఎంపిక చేశారు.
సీన్ కోసం స్మోకింగ్
‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy)లో సిగరెట్ తాగే సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు మొదట చేతులు వణికాయి. నాకు స్మోకింగ్ నచ్చదు. సీన్ కోసం దర్శకుడు పొగాకు లేని సిగరెట్లు తెప్పించాడు. మూడు రోజులు సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేసి ఆ సీన్‌లో నటించా. కొన్ని హాలీవుడ్ (Hollywood) సినిమాలు చూసి స్మోకింగ్ ఎక్స్‌ప్రెషన్లు నేర్చుకున్నా.
పార్టీలు నచ్చవు
మా అమ్మ ఫ్యాషన్ డిజైనర్. షూటింగ్స్‌కు నాతో పాటు వస్తుంటుంది. ఇద్దరం కలిసే కథలు వింటుంటాం. పార్టీలు నాకు అస్సలు నచ్చవు. షూటింగ్ మధ్యలో బ్రేక్ దొరికితే.. అమ్మ, నేను ముంబైలో వాలిపోతాం. కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతా. ఇంట్లో ఎంత అల్లరి చేస్తానో, బయటకి వచ్చానంటే అంత సైలెంట్‌గా ఉంటా.
ఆ పాట ఇష్టం
‘జయం’ (Jayam)లోని ‘రాను రానంటూనే సిన్నదో’ పాట నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మొదటసారి విన్నా. చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి రెగ్యులర్‌గా వింటూ ఉండేదాన్ని. అలాంటిది ఆ పాట రీమిక్స్‌లో స్టెప్పులు వేసే అవకాశం రావడం ఆనందంగా అనిపించింది. యాక్షన్ పాత్రలో నటించాలనేది నా కల. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా.
లెటర్ ఫ్రేమ్ కట్టించా...
‘ఉప్పెన’ చూసి చిరంజీవి (Chiranjeevi)గారు నాకొక గిఫ్ట్, లెటర్ పంపించారు. ఆ లెటర్‌లో ‘యూ ఆర్ ఏ బోర్న్ స్టార్’ (You are A Born Star) అని రాసుంది. అది చూసి నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. ఆ లెటర్‌ను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నా.
ఇవి కూడా చదవండి:
************************************************
*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..
*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..
*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?
*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ