Srikanth: పొలిటికల్ సెటైర్ కాదు.. సిస్టమ్‌లో జరిగేదే చూపించాం
ABN, First Publish Date - 2023-11-22T18:22:55+05:30
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.
రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) లీడ్ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ (Kotabommali PS). శ్రీకాంత్ (Srikanth), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 (Geetha Arts 2) బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్.. ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
‘‘కోట బొమ్మాళి పీఎస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్‌ని ఛేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీస్ ఛేజెస్ పోలీస్ అనేలా కథ ఉంటుంది. పోలీసులను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటనేది ఈ చిత్ర మెయిన్ కాన్సెప్ట్. ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్‌లో జరిగేది మాత్రమే చూపించారు.. కానీ పొలిటికల్‌గా ఎలాంటి సెటైర్లు ఇందులో ఉండవు. (Srikanth about Kotabommali PS)
దర్శకుడు తేజ మార్ని ఈ సబ్జెక్టును బాగా డీల్ చేశాడు. ఈ కథ చెబుతున్నప్పుడే థ్రిల్ అయ్యాను. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో నేను నటించాను. దీనికోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. నేను, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, మా పై ఆఫీసర్‌గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పైఎత్తులు వేస్తూ ఉంటాను. ఇందులో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది.
మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇందులో చక్కగా చూపించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నయట్టు’ చిత్రానికి ఇది రీమేకే అయినా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ ఇది. పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న పాత్ర. ఒరిజినల్‌గా పోలీసులు ఎలా ఉంటారు.. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో.. నా పర్ఫామెన్స్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా యంగ్ బ్యాచ్. చాలా స్ట్రాంగ్‌గా దీన్ని రూపొందించారు. సాంకేతిక నిపుణులందరూ ప్యాషన్‌తో వర్క్ చేశారు. నైట్ టైం అడవిలో చెప్పులు లేకుండా పరిగెత్తడం, చేజింగ్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను కానీ ఇందులో చూసిన లొకేషన్స్‌ని ఎక్కడ చూడలేదు. పాడేరు ప్రాంతలో బాగా డెప్త్కి వెళ్లిపోయి మరీ షూట్ చేశాం. నాకు ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాంటిది.
లింగిడి లింగిడి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై బజ్ బాగా పెరిగింది. సినిమా కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మా అందరిలో ఉంది. ఏ ఆర్టిస్ట్‌కి అయినా సిన్సియారిటీ ముఖ్యమని రాహుల్‌కి, శివానికి చెప్పేవాడిని. రాహుల్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనను చూస్తే నా బిగినింగ్ డేస్‌లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. మన తెలుగు అమ్మాయి శివాని కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తుంది. రాజకీయ నాయకుడిగా మురళీ శర్మ పోషించిన పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో పాత్రలతో పాటు.. డైలాగ్స్, ఎమోషన్స్ అన్ని చాలా నేచురల్‌గా ఉంటాయి. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్య చాలా క్లారిటీగా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ (Game Changer), ఎన్టీఆర్‌తో ‘దేవర’ (Devara) చిత్రాలతో పాటు.. మోహన్ లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ (Vrushabha) చిత్రంలోనూ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాను’’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
====================
*Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది
*****************************
*Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?
*******************************