సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

100 Year Old Barber: వందేళ్లకు కూడా కుర్రాడిలా పనిచేస్తున్న ఇతను సంచలనమే కదా !

ABN, First Publish Date - 2023-04-10T14:19:06+05:30

అతనికి నూరేళ్లు, కానీ ఇంకా కుర్రాడిలా ఎలా పనిచేస్తున్నాడో చూడండి. అతని పేరు సీతారామ రావు, మచిలీపట్టణం లో క్షురకుడు. దర్శకుడు మారుతి తాతగారికి, తండ్రికి, తనకి కూడా జుత్తు కత్తిరించేవాడు అని చెప్పాడు...

100 year old Seetha Rama Rao is still working
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం 58 ఏళ్లకో, 60 ఏళ్లకు లేదా ఎప్పుడు కల పరిమితి పెడితే అప్పటివరకు పని చేసి ఆ తరువాత పదవీ విరమణ చేసెయ్యాలి. ప్రైవేట్ కంపెనీ లో పని చేసేవాళ్లు పరిస్థితి అంతే. అయితే ఇలా వుద్యోగం కాకుండా స్వంత పని చేసుకునే వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉండదు కదా ! వాళ్ళు ఎంతకాలం చెయ్యగలిగితే అంతకాలం చేస్తారు, ఆ తరువాత ఇంకా విశ్రమిస్తారు.

కానీ మచిలీపట్టణం లో నివసించే ఈ సీత రామరావు గారి (Seetha Rama Rao) వయస్సు ఎంతో తెలుసా ! నూరేళ్ళు, అక్షరాలా వందేళ్లు అతనికి. కానీ పని నుంచి అతను రిటైర్ కాలేదు. వందేళ్లు అయినా పని చేస్తూనే వున్నారు.

దర్శకుడు మారుతి (Director Maruthi) ఈరోజు ఒక ట్వీట్ చేసాడు. అందులో ఈ సీత రామరావు గారు గురించి ప్రస్తావించాడు. ఇతను వృత్తి క్షవరం (#100YearOldBarber) చెయ్యడం. దేనికైనా కొన్నాళ్ల వరకే కదా పని చెయ్యగలరు ఎవరయినా, కాయి ఆశ్చర్యం, ఈ రామ రావు అనే వ్యక్తి 100 ఏళ్ళు అవుతున్నా ఇంకా తన పని, వృత్తి అంటే అంత గౌరవం అందుకే ఇంకా పని చేస్తున్న వున్నారు.

మారుతీ తాతగారు అతని దగ్గరే క్షవరం చేయించుకునేవారు, అలాగే మారుతి నాన్నగారు, ఇంకా మారుతి కూడా రామ రావు జుత్తు కత్తిరించేవాడు. ఇంకా చాలామందికి జుత్తు కత్తిరిస్తున్నారు కూడా అతను. ఇది తనకి చిన్నప్పటి ఒక మంచి జ్ఞాపకం అని చెప్తాడు మారుతి. అంతేకాదు అతను ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి కూడాను. 'శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి', అనే ఇతనికి కూడా అనాలి. ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలానే యాక్టివ్ గా పని చేస్తూ అందరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఇతను. మారుతి ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

Updated Date - 2023-04-10T14:19:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!