కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

ABN, First Publish Date - 2023-08-08T17:23:25+05:30

మెగాస్టార్ చిరంజీవి , స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘భోళా శంకర్‌’. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. దర్శకుడు మెహర్ రమేష్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Director Meher Ramesh

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ (Meher Ramesh) కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌‌ను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోన్న నేపథ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Director Meher Ramesh About Bholaa Shankar)

చాలా గ్యాప్ తర్వాత.. ఈ సినిమాతో మళ్లీ డైరెక్టర్‌గా.. ఎలా అనిపించింది?

‘భోళా శంకర్’ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం. మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు, భారీ సెట్‌లో మెగా లెవల్ సినిమా స్టార్ట్ చేశాం. అన్నయ్య‌ని డైరెక్ట్ చేయడం నా డ్రీమ్. ఇప్పటికీ ఆ డ్రీమ్‌లోనే వున్నాను. ఆగస్ట్ 11 ఆ డ్రీమ్ రిలీజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అన్నయ్యని, ఆయన సినిమాలని చూస్తూ ఆయన్ని ఇలా చూపించాలని ప్రతి క్షణం తపనపడుతూ ఈ సినిమా తీశాం. అన్నయ్య ఇచ్చిన ఎనర్జీతో సినిమా మొత్తం అయిపోయింది. అన్నయ్య కూడా చాలా ఎంజాయ్ చేశారు. దర్శకుడికి ఏం కావాలో అన్నయ్యకి బాగా తెలుసు. ఇందులో నా ఒక్కడికే దక్కిన అదృష్టం ఏమిటంటే నేను అన్నయ్య కజిన్. చిన్నప్పటినుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆయనతో ‘బావుందిరా’ అని అనిపించుకున్నాను. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు. నేను డైరెక్టర్ అయ్యిందే ఈ సినిమా చేయడానికేమో. ఇది పెద్ద అచీవ్‌మెంట్. దీని తర్వాత చేసేదంతా బోనస్.


ఈ సినిమా ఒక పిక్నిక్‌లా గడించిందని మెగాస్టార్ (Megastar) అన్నారు? అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి మేరేం చేశారు?

అన్నయ్య సెట్స్‌లో ఉంటేనే ఒక పిక్నిక్‌లా వుంటుంది. ఆయన కార్వాన్‌లోకి కూడా వెళ్లరు. సెట్‌లోనే అందరితో సరదాగా వుంటారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా ఫాస్ట్‌గా చేసేశావ్ అని అన్నయ్య అన్నారు. దర్శకుడిగా నేను ఫాస్ట్ ఫిలిం మేకర్‌ని. ‘బిల్లా’ సినిమా నాలుగున్నర నెలలో పూర్తి చేశాం. ఫాస్ట్‌గా ఫిలిం తీయడంలో దాని రికార్డ్ ఇంకా ఎవరూ కొట్టలేదు. భోళాని కూడా చాలా ఫాస్ట్‌గా తీశాం. 120 వర్కింగ్ డేస్. అంతా పిక్నిక్‌లా జరిగింది.

మెగాస్టార్ ‌నుండి మీకు ఎలాంటి సలహాలు సూచనలు వచ్చాయ్?

సినిమా విషయంలో అన్నయ్య సలహాలు సూచనలు ఖచ్చితంగా వుంటాయి. రీమేక్ సినిమా అయినప్పటికీ ఆయనకి నచ్చితేనే ఆమోదముద్ర పడుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే చాలా చక్కగా ప్రశంసిస్తారు. చాలా విలువైన ఇన్‌పుట్స్ ఇస్తారు.

‘వేదాళం’ (Vedalam) రీమేక్ చేయడానికి కారణం?

చిరంజీవిగారిని అన్నయ్య అని పిలవడం తప్పితే మరో పదం వుండదు. ఇందులో అన్నయ్య తత్త్వం వుంది. అది నాకు చాలా నచ్చింది. జనరేషన్ మారిపోయినా అనుబంధాలు అలానే వున్నాయి. యాక్షన్ ఎంటర్ టైన్‌మెంట్‌తో పాటు బ్రదర్ సిస్టర్ ఎమోషన్ వున్న కథ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడూ డీల్ చేయలేదు. చిరంజీవి‌గారి ఇమేజ్ కి తగ్గట్టుగా ఇందులో మార్పులు చేశాం. సెకండ్ హాఫ్ చిరంజీవి గారికి ఇచ్చిన ట్రీట్ కంప్లీట్ డిఫరెంట్‌గా వుంటుంది. ఒరిజినల్‌కి దాదాపు 70 శాతం మార్పులు చేశాం. అన్నయ్య నాకు ఎలా కనిపిస్తారో అది ఈ సినిమాలో చూపించా. అన్నయ్య నాకు హిమాలయ శిఖరం‌లా కనిపిస్తారు.


పదేళ్ళ నుంచి కామ్‌గా ఉన్నారు.. ఈ గ్యాప్ రావడానికి కారణం ఏమిటి?

కొన్ని కథలు చేసుకున్నాను. ఐతే అన్నయ్య కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయనతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. మన కమ్ బ్యాక్ కూడా అన్నయ్యతోనే అనుకున్నాను. (నవ్వుతూ). అందుకే ‘షాడో’ (Shadow)లో వున్న నాపై మెగా లైట్ పడిందని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను.

ఇప్పుడు రీమేక్ అంటే రిస్క్ కదా.. ఈ రిస్క్ ఎలా ఫేస్ చేశారు?

రిస్క్ కంటే బిగ్ టాస్క్ అనుకున్నాం. ‘బిల్లా’ (Billa) కూడా టాస్కే. ప్రభాస్‌ని ఎలా చూపించాలనేది నా టాస్క్. అలాగే ‘భోళా శంకర్’ కూడా. రీమేక్ చేయడం పెద్ద టాస్క్. ఒక పెద్ద సక్సెస్ అయిన చిత్రాన్ని కరెక్ట్ గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి. ‘భోళా శంకర్’ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజంట్ చేశాం. ‘రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్’ తర్వాత ఎలా తీద్దామని అనుకున్నానో అలానే తీశాను. ఇందులో చిరంజీవి‌గారి మార్క్ ఉంటేనే కొత్తగా వుంటుంది. చిరంజీవిగారి సినిమా నుంచి కావాల్సిన అన్ని అంశాలు ‘భోళా శంకర్’లో వుంటాయి. అడిషనల్‌గా చిరు లీక్స్ (Chiru Leaks) ద్వారా వచ్చిన పవర్ స్టార్ (Power Star) గారి మేనరిజం కూడా (నవ్వుతూ). అన్నయ్య పై వున్న ప్రేమ అభిమానం చూపించడానికే ఈ కథ నాకోసం ఎదురుచూసింది.

మహతి సాగర్‌తో మ్యూజిక్ జర్నీ గురించి..?

మణిశర్మ (Mani Sharma)గారు మ్యూజిక్‌లో మెగాస్టార్. అన్నయతో సినిమా చేస్తున్నపుడు మణిశర్మగారి పేరో మరో పెద్ద సంగీత దర్శకుడి పేరో అనుకోవడం సహజం. ఐతే ముఫ్ఫై ఏళ్ళ క్రితం చిరంజీవి‌గారి ఫ్యాన్‌కి ఇప్పుడు కొడుకో కూతురో వుంటున్నారు. వాళ్ళు అన్నయ్య సినిమాకి వచ్చి పేపర్స్ ఎగరేస్తున్నారు. జనరేషన్ మారింది కానీ ఆయనపై వున్న ప్రేమ అభిమానం మారలేదు. ఒక యంగ్ వైబ్ కావాలని అనుకున్నాం. మహతి స్వర సాగర్ (Mahathi Swara Sagar) వర్క్ నాకు తెలుసు. మెగాస్టార్ స్థాయి‌కి సాగర్ మ్యూజిక్ చేయగలడని నా నమ్మకం, ఈ విషయంలో గొప్పతనం అంతా అన్నయ్యదే. సాగర్ పేరు చెప్పినపుడు మరో ఆలోచన లేకుండా ‘వెరీ గుడ్ మనం ప్రోత్సహించాలి’ అన్నారు. సాగర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. భోళా మానియా, జామ్ జామ్, తీనుమారు ఇలా పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. నేను కూడా పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ఇందులో ఒక ర్యాప్ సాంగ్ రాశాను. ప్రేక్షకులు అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తారు.


కీర్తి సురేష్‌ (Keerthy Suresh)ని చెల్లెలు పాత్రలోకి ఎలా తీసుకొచ్చారు?

మెగాస్టార్‌కి ఒక మెగా నటి కావాలి. స్వప్న దత్ గారి ద్వారా ఈ పాత్ర గురించి చెప్పడం జరిగింది. స్వప్నదత్ గారికి థాంక్స్ చెప్పాలి. ఈ కథ‌లోని ఎమోషన్‌కి కీర్తి సురేష్ చాలా కనెక్ట్ అయ్యింది. వెంటనే చేస్తానని చెప్పారు. వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్‌‌గా రవితేజ (Ravi Teja) ఎసెట్. ఇందులో కీర్తి సురేష్ పాత్ర కూడా సిస్టర్ సెంటిమెంట్‌గా హైలెట్ వుంటుంది. అలాగే తమన్నా, సుశాంత్‌ల పాత్రలు కూడా చాలా చక్కగా కుదిరాయి. పాత్రలన్నీ చాలా మంచి వినోదం పంచుతాయి.

నిర్మాతల నుంచి ఎలాంటి సహకారం వుండేది?

అనిల్ సుంకర (Anil Sunkara)గారు ఎప్పటి నుంచో చిరంజీవిగారితో సినిమా చేయాలని అనుకున్నారు. నిన్న సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవిగారితో ఎలాంటి సినిమా తీయాలని అనుకున్నామో అలాంటి సినిమా తీశామని హ్యాపీగా ఫీలయ్యాం. అనిల్ గారు చాలా పాజిటివ్ పర్సన్. సినిమా అంటే ప్యాషన్ వున్న ప్రొడ్యూసర్. ఆయనకి సినిమాపై పూర్తి అవగాహన వుంది. ఎక్కడా రాజీపడకుండా కావాల్సింది సమకూర్చి చాలా గ్రాండ్‌గా ‘భోళా శంకర్’ని నిర్మించారు.

ఫైనల్‌గా.. భోళా శంకర్ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?

‘భోళా శంకర్’ చిత్రాన్ని ఇంటిల్లిపాది థియేటర్‌కి వెళ్లి చూడండి. మనం యూత్‌లో వున్నప్పుడు చిరంజీవి‌గారిని ఇప్పుడు యూత్‌కి హ్యాపీగా చూపించండి.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..

***************************************

*Pawan Kalyan: గుండెకు గొంతొస్తే.. బాధకి భాషొస్తే.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్


***************************************

*Upasana: ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఉపాసన సంచలన నిర్ణయం

***************************************

*Kushi: మహేష్ బాబు బర్త్‌డేకి విజయ్ దేవరకొండ ఇస్తోన్న ట్రీట్ ఇదే..

***************************************

*Jawan: మ‌రోసారి లుంగీ డ్యాన్స్‌తో.. ఈసారి దుమ్ములేచిపోవడం ఖాయం

***************************************

Updated Date - 2023-08-08T17:23:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!