Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్
ABN, First Publish Date - 2023-04-25T21:26:14+05:30
ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ డింపుల్ హయతి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె ఏం చెప్పారంటే..
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand), డైరెక్టర్ శ్రీవాస్ (Sriwass) కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’ (Rama Banam). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి (Dimple Hayathi) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ డింపుల్ హయతి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. (Dimple Hayathi Interview)
‘‘రామబాణం సినిమాని ‘ఖిలాడి’ (Khiladi) సినిమా చేస్తున్నపుడే సైన్ చేశాను. ‘ఖిలాడి’లో చాలా గ్లామరస్‌గా కనిపించాను. ఆ సినిమా చూసిన తర్వాత దర్శకుడు శ్రీవాస్ గారు ఎందుకో భైరవిలా అనిపించడం లేదనే సంకోచం వ్యక్తం చేశారు. రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో భైరవి పాత్రకు సరిపోతాననే నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు. ఇందులో అర్బన్ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర పేరు భైరవి. తను వ్లాగర్. నిజ జీవితంలో అయితే నేను సోషల్ మీడియాకి దూరంగా వుంటాను. కాబట్టి ఈ పాత్ర నాకు కొత్తగానే అనిపించింది. రీల్స్, వ్లాగ్స్ చేయడంలో ఫన్ జనరేట్ అయ్యింది. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్‌లు వున్నారు. వారందరితో కలసి వ్లాగ్ చేయాలి, ఇది చాలా ఎంటర్టైనింగ్గా వుంటుంది. రామబాణం అందరినీ అలరించే ఎంటర్టైనర్.
గోపీచంద్ (Gopichand)గారు చాలా తక్కువగా మాట్లాడతారు. పొద్దున్న హాయ్ అంటే సాయంత్రం బాయ్.. దట్సాల్. నేను కూడా తక్కువగానే మాట్లాడతాను. ఆయన చాలా ఫోకస్డ్గా వుంటారు. సీన్ సరిగ్గా రాకపోతే ఆయన కళ్ళలోనే అర్ధమైపోతుంది. చాలా కంపోజ్డ్గా మాట్లాడతారు. జెంటిల్ మెన్. చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా సెట్లో ఎప్పుడూ ఓ పది మంది ఆర్టిస్ట్‌లు సెట్ మొత్తం వుంటారు. ఎప్పుడూ కళకళలాడుతూనే వుండేది. సెట్లోకి వెళ్ళిన తర్వాత జగపతి బాబు (Jagapathi babu)గారు, కుష్బూ (Kushboo)గారు, అలీగారు, వెన్నెల కిషోర్, రజిత... ఇలా చెబుతూవుంటే పెద్ద లిస్టే అవుతుంది. ఈ ప్రయాణంలో కుష్బూగారు నాకు సెకండ్ మదర్‌లా అయిపోయారు. చాలా దగ్గరయ్యాం. ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడే కొన్ని ట్రిప్స్‌కి కూడా వెళ్లాం. నన్ను వాళ్ళ అమ్మాయిలానే చూసుకున్నారు. సెట్లో ఆవిడ అనుభవాలని పంచుకున్నారు. అవి నాకు ఎంతగానో సహకరించాయి. అలాగే జగపతి బాబుగారు కూడా. రామబాణం గ్రేట్ జర్నీ. (Dimple Hayathi Rama Banam Interview)
నన్ను చాలా మంది యాక్టింగ్ స్కూల్‌కి వెళ్ళారా? అని అడుగుతారు. నేను ఎప్పుడూ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్ళలేదు. ఇంట్లోనే చాలా మంది డ్యాన్సర్లు, యాక్టర్స్ వున్నారు. ఇంటి నుంచే ఎక్కువ క్రిటిసిజం వుంటుంది. నటన కూడా డ్యాన్స్ నుంచే వచ్చింది. క్లాసికల్ డ్యాన్స్ విషయంలో ప్రత్యేకంగా అరంగేట్రం అంటూ ఏమీ చేయలేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఫ్లో లోనే వచ్చింది. కూచిపూడిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఒకప్పుడు ప్రతిఏడాది వేలాది మంది డ్యాన్సర్లతో సిలికానాంధ్ర ప్రోగ్రాం నిర్వహించేది. అందులో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది.
మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. చాలా మంది నటులు, డ్యాన్సర్లు వున్నారు. నాన్న బిజినెస్ మాన్. నాన్న తమిళ్. అమ్మ తెలుగు. బెజవాడలో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. ప్రస్తుతం రెండో సినిమాగా రామబాణం చేస్తున్నాను. తెలుగు వాళ్లకి మంచి అవకాశాలు వస్తున్నాయి. పరిస్థితులు మారాయి. సినిమా మారింది. శ్రీలీల (Sreeleela) తెలుగమ్మాయి. మరో నలుగురు తెలుగమ్మాయిలు హీరోయిన్స్‌గా వచ్చినపుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. నటిగా గద్దల కొండ గణేష్ (Gaddalakonda Ganesh) సాంగ్ , ఇందులో ఐఫోన్ సాంగ్ ఒకటే. నటిగా సరిగ్గా చేశానో లేదో చూసుకుంటాను. అని రకాల పాత్రలు చేయాలని వుంది.
హిందీ, తమిళ సినిమాల ప్రయాణం విషయానికి వస్తే.. తమిళ్లో ప్రభుదేవా (Prabhu Deva), విశాల్ (Vishal)గారితో చేశాను. అలాగే బాలీవుడ్ సినిమా ‘అత్రంగి రే’లో కూడా చేశాను. నాకు ఇతర భాషల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఈ ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. తెలుగు, తమిళ్లో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే వాటిని అనౌన్స్ చేస్తారు..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Amala Paul: కథ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు
*Virupaksha Director: సాయితేజ్‌కి బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..
*Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?
*Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?
*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్