సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Avika gor: ఆ కంఫర్ట్‌ లేదు.. మళ్లీ పాత రోజులు వస్తాయి...

ABN, First Publish Date - 2023-01-19T12:45:18+05:30

గడచిన ఏడాది తనకెంతో ప్రత్యేకమని చెబుతోంది చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికాగోర్‌. హైదరాబాద్‌లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడచిన ఏడాది తనకెంతో ప్రత్యేకమని చెబుతోంది చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికాగోర్‌(Avikagor). హైదరాబాద్‌లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్‌ గ్లోబ్‌(Golden globe) అవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారామె. దర్శకుడు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. అవికా గోర్‌(avika)++- మాట్లాడుతూ ‘‘కొత్త సంవత్సరంలో ప్రత్యేకంగా రిజల్యూషన్స్‌ అంటూ ఏమీ ఉండవు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నాకు ఆ అలవాటు లేదు. ప్రతి రోజు బాగుండాలనీ, కొత్తగా ఉండాలని ట్రై చేస్తా. 2023 క్యాలెండర్‌ కోసం ఓ ఫొటో షూట్‌ చేశా. దానిలో నా ఫొటోలు చూసి నేనే షాక్‌ అయ్యా. క్యూట్‌గా, బోల్డ్‌గా చాలా నచ్చాయి. లైఫ్‌ని నేనేం మార్చుకోవాలనుకోను, నచ్చినట్లు ఉంటానంతే! నాలో మార్చుకోవలసింది ఏమీలేదు. గడిచిన ఏడాది కాస్త ప్రత్యేకం. మంచి సినిమా ఆపర్లు వచ్చాయి. కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాది నేను నటించిన రెండు తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు చిత్రాలకు నేను కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించా. నిర్మాణరంగంలో అడుగుపెట్టడం కొత్త అనుభూతినిచ్చింది. (Rajamouli)

ప్రేమే జీవితం అని నా అభిప్రాయం. అభిమానులు చూపించే ప్రేమతోనే నేనీ స్థాయిలో ఉన్నానని నమ్ముతాను.

కల నెరవేరిన వేళ...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కల నిజమైన వేళ ఇది. పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ కొన్ని డ్రీమ్స్‌ ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళిగారు ఆ గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు ఆనందంగా ఉంది.

మళ్లీ పాత రోజులు వస్తాయి...

డ్రెసింగ్‌, ఫ్యాషన్‌ విషయనికొస్తే.. 1980-90లో సినిమాలు చూసినప్పుడు అప్పటి దుస్తులు వేసుకున్నవారికి చూసేవారికి కంఫర్ట్‌గా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఫ్యాషన్‌ పేరుతో ఇప్పుడు అలాంటి సౌకర్యం ఎవరికీ లేదు. ఆ కంఫర్ట్‌ కోసం మళ్లీ పాత రోజులకు వెళ్తాం అనిపిస్తుంది.

Updated Date - 2023-01-19T17:39:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!