Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-18T17:47:21+05:30
అఖిల్ అక్కినేని (Akhil Akkineni).. అతి త్వరలో ‘ఏజెంట్’ (Agent)గా అందరినీ పలకరించబోతున్నాడు. ప్రస్తుతం CCLలో ఎక్కడ విన్నా అఖిల్ పేరే వినిపిస్తుంది. ఆయన కొట్టే సిక్సర్ల గురించే అంతా..
అఖిల్ అక్కినేని (Akhil Akkineni).. అతి త్వరలో ‘ఏజెంట్’ (Agent)గా అందరినీ పలకరించబోతున్నాడు. ప్రస్తుతం CCLలో ఎక్కడ విన్నా అఖిల్ పేరే వినిపిస్తుంది. ఆయన కొట్టే సిక్సర్ల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే అఖిల్ జీవితంలో మ్యారేజ్‌కు (Marriage) సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలియంది కాదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత అఖిల్ పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడకపోయినా.. రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అఖిల్ పెళ్లి (Akhil Akkineni Marriage) చేసుకోబోతున్నాడంటూ ఏదో ఒక రూపంలో రూమర్స్ వ్యాపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై అఖిల్ క్లారిటీ ఇచ్చారు. CCL నిమిత్తం ప్రాక్టీస్ సెషన్‌లో ఉన్న అఖిల్ ABN ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందులో..
CCL గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు కూడా నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. టీమ్ సభ్యులందరితో మంచి బాండింగ్ కొనసాగిస్తూ.. జట్టు బలంగా ఉండటానికి బాటలు వేస్తుంటాం. ప్రతి ఒక్కరితో ఫేస్ టు ఫేస్ చర్చలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందరం వారి వారి మైండ్స్‌లో ఏముందో తెలుసుకుంటాం.. అదికాకుండా నా మైండ్‌లో ఏముందో చెప్పి.. టీమ్ అంతటిని ఒక తాటిపైకి తీసుకొస్తాను. ఏదీ కాంప్లీకేటెడ్‌గా భావించము.
చిన్నప్పుడు స్కూల్ టైమ్‌లో క్లాస్ బ్రేక్ కాకపోయినా.. మేము వెళ్లి ఆడేస్తుండే వాళ్లం. చాలా సార్లు దొరికేశాం. ఎన్నో కిటీకీల అద్దాలు బద్దలకొట్టాను. ఎన్నో సిక్స్‌లు కొట్టాను. స్పోర్ట్స్ నా జీవితంలో 50 శాతం ఉంటాయి. హార్స్ రైడింగ్, క్రికెట్, బాస్కెట్ బాల్.. ఇలా ప్రతి గేమ్‌ను నేను ట్రై చేస్తాను. ఇండియాలో పిల్లలందరినీ స్పోర్ట్స్ విషయంలో ఎంకరేజ్ చేయండి. అది ఏ గేమ్ అయినా పరవాలేదు. పిల్లలని మానసికంగా ధృడంగా ఉండేలా చేయడమే కాకుండా.. క్రీడలతో కమ్యూనికేషన్ స్కిల్స్, పిల్లల మధ్య స్నేహభావం పెంపొందుతాయి. నాకు స్పోర్ట్స్ కార్లంటే (Sports Cars) ఇష్టం లేదు.. నా వరకు అన్నీ స్పోర్ట్స్‌లోనే ఉంటాయి.
సోషల్ మీడియా (Social Media) అనేది నాకు ఎక్కువగా తెలియదు. పెద్దగా దాని గురించి పట్టించుకోను. ఎక్కువగా పోస్ట్‌లు కూడా చేయను. కేవలం వృత్తికి కావాల్సిన విధంగా మాత్రమే పోస్ట్‌లు చేస్తుంటాను. నా అభిమానులు నన్ను మిస్ అవుతున్నారనే విషయం నాకు తెలుసు. కానీ సోషల్ మీడియా పరంగా నాకంత పట్టులేదు. నాకు సోషల్ మీడియా అంటే సిగ్గు, భయం. (Akhil Akkineni Interview)
పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి.. కానీ నేనిప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నాను. మింగిల్ అయ్యే ఆలోచన ఇప్పట్లో లేదు. నాకు లవ్ మీన్స్ స్పోర్ట్స్ (Sports) అంతే.. అని అఖిల్ చెప్పుకొచ్చారు. (Akhil Akkineni about Marriage)
ఇవి కూడా చదవండి:
*********************************
*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది
*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్
*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..
*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్
*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?
*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?
*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది