సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Arjun Das: తెలుగు సినిమాలో అవకాశం వస్తుందని ఊహించలేదు

ABN, First Publish Date - 2023-01-18T21:00:57+05:30

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (Fortune Four Cinemas)తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా..

Arjun Das
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (Fortune Four Cinemas)తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’ (Butta Bomma). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్ (Anikha Surendran), సూర్య వశిష్ఠ (Surya Vashistta), అర్జున్ దాస్ (Arjun Das) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ (Shourie Chandrasekhar Ramesh) దర్శకుడిగా పరచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటుడు అర్జున్ దాస్ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. (Arjun Das Interview)

సినీ ప్రయాణం:

పెరుమాళ్ తర్వాత చాలాకాలం ఎదురుచూశాను. ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

‘బుట్ట బొమ్మ’తో మీ ప్రయాణం:

ఒకసారి నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉంచి, ఈ సినిమా ఖచ్చితంగా మీరే చేయాలని అన్నారు. మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీ గారిని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. అప్పటివరకు నేను వంశీ గారిని కలవలేదు. ఆ రోజే ఆయనను మొదటిసారి కలిశాను. పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.

మాతృక ఓటీటీలో ఉన్నా.. రీమేక్ చేయడానికి కారణం:

ఇదే ప్రశ్న నిర్మాత వంశీ గారిని అడిగాను. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన నమ్మారు. అలాగే ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ఆర్.కె. నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. కొత్త అనుభూతిని ఇస్తుంది.

తెలుగు సినిమాలో నటించడంపై ఫీలింగ్: (Arjun Das Butta Bomma Interview)

తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు. ఒకసారి హైదరాబాద్‌లో ఒక మాల్‌కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో ఫోటోలు దిగడానికి రావడం చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ లభించిన స్వాగతం అసలు మరచిపోలేను. కొందరికి నా పేరు గుర్తులేకపోయినా సినిమాల్లో పోషించిన పాత్రల పేరుతో పిలుస్తూ మాట్లాడిస్తున్నారు. నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా దగ్గర అయ్యాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను.. కానీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. నాకు తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం, డబ్బింగ్ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా చేరువయ్యాయని తెలియడం చాలా సంతోషంగా ఉంది.

నెగటివ్ పాత్రలు ఎందుకు అంటే..

అలా అని ఏంలేదు. నా దగ్గరకు వస్తున్న పాత్రలను బట్టి ఎంచుకుంటున్నాను. నేను అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెగటివ్ రోల్స్‌లో కూడా ఏదైనా కొత్తదనం ఉంటేనే చేస్తాను. అలాగే విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా ఇంకా నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. ఖైదీ తర్వాత ఎక్కువగా నెగటివ్ రోల్స్ వచ్చాయి. మాస్టర్ తర్వాత ఊహించని విధంగా రొమాంటిక్ రోల్స్ వచ్చాయి. ఇలా ఒక్కో సినిమా తర్వాత ఒక్కో రకమైన పాత్రలు వస్తున్నాయి.

ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పారా..

అవును ఎక్కువగా నా వాయిస్ గురించి మాట్లాడుతుంటారు. అలాగే నా నటనను కూడా ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాను. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు. మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి, ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.

Updated Date - 2023-01-18T21:00:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!