Hansika: మా కుమార్తెలు వేగంగా ఎదుగుతారు.. హన్సిక మదర్ ఫైర్
ABN, First Publish Date - 2023-02-20T22:32:02+05:30
దక్షిణాదిలో చిన్న ఖుష్బూగా గుర్తింపు పొందిన నటి హన్సిక మొత్వాని (Hansika Motwani). ఈ పంజాబీ భామకు కోలీవుడ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్
దక్షిణాదిలో చిన్న ఖుష్బూగా గుర్తింపు పొందిన నటి హన్సిక మొత్వాని (Hansika Motwani). ఈ పంజాబీ భామకు కోలీవుడ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఆమెకు కొందరు అభిమానులు గుడి కూడా కట్టించారు. ఇటీవల వివాహం చేసుకుని ఓ ఇంటికి కోడలైన హన్సిక గురించి ఓ వార్త ఇపుడు హల్చల్ చేస్తోంది. ‘హన్సిక వేగంగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు (Hormonal Injections)’ తీసుకున్నది అనేది ఆ వార్త సారాంశం. దీనిపై హన్సికతో పాటు ఆమె తల్లి కూడా స్పందించారు.
‘నా వయసు 21 యేళ్లు ఉన్న సమయంలో ఈ వార్తను రాశారు. నేను ఎనిమిదేళ్ళ ప్రాయం నుంచే నటిస్తున్నా. నేను ఒక మహిళగా వేగంగా మారేందుకు మా అమ్మ హార్మోన్స్ ఇంజెక్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజంలేదు’ అని హన్సిక అన్నారు.
అలాగే, హన్సిక తల్లి మోనా మొత్వాని (Mona Motwani) స్పందిస్తూ.. ‘ఈ వార్త నిజమైతే నేను టాటా, బిర్లా కంటే ధనవంతురాలిగా ఉండేదానిని. ఇలాంటి వార్తలు రాసేవారికి రవ్వంత కూడా ఇంగిత జ్ఞానం లేదా? అనే సందేహం నాలో కలుగుతోంది. మేం పంజాబీలం. మా కుమార్తెలు వేగంగా ఎదుగుతారు’ అని ఘాటుగా స్పందించారు.