Hero Vishal : నా స్థానంలో మరో నిర్మాత ఉండుంటే గుండెపోటుతో మరణించేవాడు!
ABN, First Publish Date - 2023-09-14T11:42:49+05:30
హీరో విశాల్ దర్శకుడు మిస్కిన్‌పై మండిపడ్డాడు. అతని ప్రవర్తన కారణంగా ఎంతో ఇబ్బందిపడ్డానని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ ‘తుప్పరివాలన్’ చిత్రంలో నటించారు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘తుప్పరివాలన్-2’ రాబోతుంది.
హీరో విశాల్ (Vishal) దర్శకుడు మిస్కిన్‌పై (mysskin) మండిపడ్డాడు. అతని ప్రవర్తన కారణంగా ఎంతో ఇబ్బందిపడ్డానని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ ‘తుప్పరివాలన్’ చిత్రంలో నటించారు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘తుప్పరివాలన్-2’ (Thupparivaalan-2)రాబోతుంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మరోసారి అతనితో కలిసి పనిచేసే ఉద్దేశం లేదని చెప్పారు విశాల్. ‘మార్క్ ఆంటోని’ సిననిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
‘‘గతంలో మిస్కిన్‌తో కలిసి ‘తుప్పరివాలన్’ సినిమా చేశా. ఇప్పుడు దానికి కొనసాగింపుతగా ‘తుప్పరివాలన్-2’ చేస్తున్నా. ఇకపై అతని కలిసి పని చేసే ఉద్దేశం లేదు. ఈ సినిమా విషయంలో అతడు పెట్టిన ఇబ్బందులకు లండన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఒంటరిగా కూర్చొని బాధపడ్డా. ఆ క్షణాలను నా కెరీర్‌లోనే అత్యంత దుర్లభమైనవి ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోను. నా స్థానంలో వేరే పెద్ద వయసు ఉన్న నిర్మాత ఉండుంటే హార్ట్ ఎటాక్‌తో మృతి చెందేవారు. నేను కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకుని నిలబడగలిగాను. ఒకవేళ మిస్కిన్‌తో కలిసి ‘తుప్పరివాలన్ 2’ షూట్ చేసినా.. పర్ఫెక్ట్ అవుట్‌పుట్ రాదు. అందుకే ఆ చిత్రాన్ని ఆపేశాను. వచ్చే ఏడాదిలో నేనే ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించాలనుకుంటున్నా. నా సొంత స్ర్కీన్‌ప్లేతో ఈ చిత్రం రూపొందనుంది’’ అని అన్నారు.
2017లో రూపొందిన ‘తుప్పరివాలన్’ చిత్రాన్ని తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదల చేశారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సిద్థమైన ఈ సినిమా కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ హీరోగా ‘తుప్పరివాలన్-2’ మొదలుపెట్టారు. చిత్రీకరణ సమయంలో దర్శకుడికి హీరోరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.