Leo Trailer : థియేటర్ నాశనం.. బాధ్యులు ఎవరు?
ABN, First Publish Date - 2023-10-06T14:49:07+05:30
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన 'లియో’ (leo) చిత్రం కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. తమిళనాడులోని రోహిణి థియేటర్‌లో అభిమానులు అత్యుత్సాహంతో బీభత్సం సృష్టించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన 'లియో’ (leo) చిత్రం కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. తమిళనాడులోని రోహిణి థియేటర్‌లో అభిమానులు అత్యుత్సాహంతో బీభత్సం సృష్టించారు. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను రోహిణి థియేటర్లో ప్రదర్శించారు. అయితే ట్రైలర్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం అసహనానికి గురైన అభిమానులు ఆ థియేటర్‌లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Leo Trailer)
లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రంపై అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను అందుకోలోకపోయిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల నిరాశకు గురైన అభిమానులు థియేటర్లో విధ్వంసం సృష్టించారని కొందరు అంటుంటే, థియేటర్ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్‌ను ప్రదర్శించలేదని అందుకే అభిమానులు ఆగ్రహానికి గురయ్యారని చెబుతున్నారు. కొందరు ఈ తప్పు ఎవరిది? థియేటర్ యాజమాన్యానిదా? అభిమానులదా? థియేటర్‌లో సృష్టించిన విధ్వంసానికి, జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. చిన్మయి ఆమెకు డబ్బింగ్ చెప్పారు. ఈ విషయంపై చిత్రబృందానికి ధన్యవాదాలు చెబుతూ చిన్మయి ట్వీట్ చేయగా దానికి త్రిష రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ చిన్.. మీకు కృతజ్ఞతలు అంటూ త్రిష రిప్లై ఇచ్చారు.
పలు కారణాల చేత 5 ఏళ్ల క్రితం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన డబ్బింగ్ యూనివర్సిటీ చిన్మయిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే! ఆ నిషేధం తర్వాత ఆమెకు మొదటి సారి అవకాశం ఇచ్చినందుకు ‘లియో’ చిత్ర బృందానికి, దర్శకుడు లోకేశకు చిన్మయి కృతజ్ఞతలు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ కథానాయకుడు సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.