కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vignesh - Nayanathara : ఆమె రాకపోవడానికి అదే కారణం!

ABN, First Publish Date - 2023-09-30T15:40:47+05:30

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ జోష్‌లో ఉంది. అంతే కాదు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తదుపరి ఆమె దృష్టి అంతా ఆమె కథానాయికగా నటిస్తున్న 75వ చిత్రంపైనే! దాంతోపాటు టెస్ట్‌ అనే చిత్రంకూడా చేయబోతోంది. ఓ పక్క సినిమాలు, మరో పక్క భర్త ఇద్దరు బిడ్డల బాధ్యతతో సాఫీగా జీవితాన్ని లీడ్‌ చేస్తోంది.

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanathara) ప్రస్తుతం 'జవాన్' సక్సెస్‌ జోష్‌లో ఉంది. అంతే కాదు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తదుపరి ఆమె దృష్టి అంతా ఆమె కథానాయికగా నటిస్తున్న 75వ (Nayan 75) చిత్రంపైనే! దాంతోపాటు టెస్ట్‌ అనే చిత్రంకూడా చేయబోతోంది. ఓ పక్క సినిమాలు, మరో పక్క భర్త ఇద్దరు బిడ్డల బాధ్యతతో సాఫీగా జీవితాన్ని లీడ్‌ చేస్తోంది. అంతే కాదు ఈ మధ్యనే భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ‘9 స్కిన్‌’ పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నయన్‌ దంపతులు మలేషియా వెళ్లారు. అక్కడ జరిగిన ప్రెస్‌మీట్‌లో నయన్‌పై విఘ్నేశ్‌ (Vignesh Shivan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎన్నో విషయాల్లో తనకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు పాలుపంచుకోదో కూడా వివరించాడు.

‘‘నయనతార మనస్ఫూర్తిగా నమ్మితేనే దేనినైనా ప్రచారం చేయడానికి ముందుకొస్తుంది. చాలా సందర్భాల్లో ఆమె తన సొంత చిత్రాలను కూడా ప్రమోట్‌ చేయడానికి ముందుకు రాలేదు. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంటే అది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతుంది. అందుకే ఆమె ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుంది. ‘9 స్కిన్‌’ బ్రాండ్‌ను మొదలు పెట్టాలని మేం అనుకున్నప్పుడు నయన్‌ ఆ ఉత్పత్తులన్నింటినీ స్వయంగా వాడింది. డిజైన్‌, బాటిల్‌, స్టైల్‌, ప్యాకింగ్‌ ఇలా ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకుంది. ఈ బ్రాండ్‌ కోసం ఆమె ఎంతో శ్రమించింది’’ అని అన్నారు.

‘‘నా మొదటి చిత్రాన్ని నయనతారతో తెరకెక్కించాను. ఆ సమయంలో ఆమె నాలో స్ఫూర్తి నింపింది. చిన్న విషయంలోనూ ఆమె ఎంతో నిజాయతీగా ఉంటుంది. చేసే పనిలో వంద శాతం నిబద్ధతగా ఉంటుంది’’ అని భార్యపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Updated Date - 2023-09-30T15:58:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!