A.R.Rahman : ఏ.ఆర్.రెహమాన్ లైవ్ షోలో అవస్థలు..
ABN, First Publish Date - 2023-09-11T16:52:19+05:30
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కాన్సర్ట్‌లో తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపంతో వేదిక వద్ద జనాల్ని కంట్రోల్ చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆయన ప్యాన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) కాన్సర్ట్‌లో తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపంతో వేదిక వద్ద జనాల్ని కంట్రోల్ చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆయన ప్యాన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిర్వాహకులు కనీస ఏర్పాటు చేయలేదని (netizens trolling) తిట్టిపోస్తున్నారు.
గత నెల 12న చెన్నైలో రెహమాన్ ఓ సంగీత (Live concert) కార్యక్రమం చేయాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా అది రద్దు అయింది. అదే కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అదే వేదికపై నిర్వహించారు. అభిమాన సంగీత దర్శకుడి పాటల వర్షంలో తడిసి ముద్దవ్వాలని ఆనందంతో వేదికకు వచ్చిన అభిమానులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సీట్లు లేక, పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేక చాలా మంది అవస్థలు పడ్డారు. గోల్డ్ పాసులు ఉన్నప్పటికీ కొంతమందిని అనుమతించలేదు. దీంతో చాలామంది అక్కడి నుంచి వెనుదిరిగారు. కిక్కిరిసిన జనంతో తొక్కిసలాట జరిగింది. ఆ పరిసన ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇవన్నీ చూసిప అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆర్గనైజర్స్‌ను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. డబ్బులు తీసుకున్నప్పుడు ఏర్పాట్లు సరిగ్గా చేయడం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై తాజాగా రెహమాన్ (A.R.Rahman) స్పందించారు. ‘‘నేను కాన్సర్ట్‌పై దృష్టి పెట్టాను. బయట ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదు. అభిమానులు ఇబ్బందులు పడ్డారని తెలిసి చాలా కలత చెందాను’’ అని ట్వీట్ చేశారు. ‘‘పలు కారణాల వల్ల కాన్సర్ట్‌లోకి అడుగుపెట్టలేకపోయిన వారు.. కొనుగోలు చేసిన టికెట్, తమకు ఎదురైన ఇబ్బందులను తెలియజేసూ @BToSproductions @actcevents arr4chennai@btos.in లో పోస్ట్ చేస్తే నా టీమ్ అతి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తుంది’’ అని పేర్కొన్నారు.