Trisha : ఇంతటితో ఆపండి.. ప్రశాంతంగా ఉండండి!
ABN, First Publish Date - 2023-09-22T16:38:43+05:30
వయసు పెరుగుతోంది కానీ, త్రిష సొగసు ఏ మాత్రం చెక్కుచెదరలేదు. నటిగా ఆమె కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తికావొస్తుంది. అయినా ఇప్పటికీ నేటితరం హీరోయిన్లతో పోటీ పడుతూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా త్రిష పెళ్లికి సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.
వయసు పెరుగుతోంది కానీ, త్రిష సొగసు ఏ మాత్రం చెక్కుచెదరలేదు. నటిగా ఆమె కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తికావొస్తుంది. అయినా ఇప్పటికీ నేటితరం హీరోయిన్లతో పోటీ పడుతూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా త్రిష పెళ్లికి సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. గతంలో వరుణ్ మణియన్ నిశ్చితార్థం అయ్యి.. తర్వాత పలు కారణాలతో పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసింది. తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిష సోష్ మీడియా వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో గాసిప్పులు పుట్టిస్తున్న వారికి త్రిష బోల్డ్‌గా ఓ ట్వీట్ చేసింది.
‘మీరు మీతోపాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. ప్రశాంతంగా ఉండండి. ఇంతటితో ఈ గాసిప్పులకు ఫుల్స్టాప్ పెట్టండి.. చీర్స్! అంటూ తనదైన స్టైల్లో త్రిష పోస్ట్ చేసింది.
ప్రస్తుతం త్రిష చేతిలో వరుసగా సినిమాలున్నాయి. విజయ్‌తో ‘లియో’, అజిత్‌తో కూడా ఓ సినిమా చేయనుంది. త్రిష అంటే గిట్టని వారే ఇలా లేనిపోని వదంతులు పుట్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే త్రిషపై ఎన్నోసార్లు ఇలాంటి వదంతులు వచ్చినా ఓపికగా బరించింది. ఇప్పుడు సహనాన్ని పక్కన పెట్టి దీటుగా సమాధానం ఇచ్చింది. ఆ టీమ్ ఎవరో తెలుసుకున్న తర్వాత ఇలా రియాక్ట్ అయినట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది.