కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trisha : 'యానిమల్‌’ను ప్రశంసిస్తూ పోస్ట్‌.. ట్రోలింగ్‌ మామూలుగా లేదుగా!

ABN, First Publish Date - 2023-12-04T16:47:21+05:30

చెన్నై బ్యూటీ త్రిష (Trisha)ఈ మధ్యన వార్తల్లో నిలిచి వైరల్‌ అయింది. మన్సూర్‌ అలీఖాన్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. త్రిష (Troll on Trisha) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆదివారం రాత్రి 'యానిమల్‌' సినిమా గురించి ఓ పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌కు గురైంది.

చెన్నై బ్యూటీ త్రిష (Trisha)ఈ మధ్యన వార్తల్లో నిలిచి వైరల్‌ అయింది. మన్సూర్‌ అలీఖాన్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. త్రిష (Troll on Trisha) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆదివారం రాత్రి 'యానిమల్‌' సినిమా గురించి ఓ పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌కు గురైంది. 'యానిమల్‌' (Animal) గురించి ఒక్క పదంలో.. కల్ట్‌ (Cult movie) సినిమా అని ప్రశంసిస్తూ ఇనస్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. దీంతో నెట్టింట ఫ్యాన్స్  ఆమెను ఓ రేంజ్‌ లో ఆడుకున్నారు. ఇటీవల మన్సూర్‌ అలీ ఖాన్  చేసిన కామెంట్‌లకు ఫెమినిస్ట్‌ కామెంట్స్‌ చేసిన త్రిష.. ఇప్పుడు యానిమల్‌ మూవీకి ఇలాంటి రివ్యూ ఇవ్వడమేంటని సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. నువ్వు అసలైన స్త్రీవాదివేనా? మహిళలను దారుణంగా అవమానించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. నువ్వో నకిలీ ఫెమినిస్ట్‌ వంటూ ఆమెను టార్టెగ్‌ చేశారు. 

మన్సూర్‌   అలీఖాన్   విషయంలో త్రిషకు అండగా నిలిచిన నెటిజన్లే ఇప్పుడు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆమెకు పోస్ట్‌ విపరీతంగా వ్యతిరేకత రావడంతో త్రిష తన పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. ఈ ఏడాది పొన్నియిన్‌ సెల్వన్‌ - 2, ది రోడ్‌, లియో చిత్రాలతొ ఆకట్టుకున్న త్రిష ఇప్పుడు విదాముచార్చి, థగ్‌ లైఫ్‌ సినిమాలు చేస్తోంది. 

Updated Date - 2023-12-04T17:09:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!