సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Varisu Vs Thunivu: వారిసు ట్రైలర్ విడుదల.. హీరోల ఫ్యాన్స్ మధ్య ముదిరిన ట్వీట్ల వార్

ABN, First Publish Date - 2023-01-05T12:28:36+05:30

కోలీవుడ్‌లో అజిత్ కుమార్ (Ajith Kumar), విజయ్ దళపతి (Vijay Thalapathy)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Varisu Vs Thunivu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌లో అజిత్ కుమార్ (Ajith Kumar), విజయ్ దళపతి (Vijay Thalapathy)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి అక్కడ ప్రత్యేకంగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. దీంతో ఆ ఫ్యాన్ అసోసియేషన్ల మధ్య సాధారణంగానే మా హీరో గ్రేట్ అంటే.. మా హీరో గ్రేట్ అంటూ వివాదం నడుస్తూ ఉంటుంది. ఈ తరుణంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే ఇంక ఊరుకుంటారా?.. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు.

జనవరి 11న అజిత్ కుమార్ ‘తునివు’ (Thunivu) (తెలుగులో తెగింపు).. ఒకే రోజు గ్యాప్‌లో అంటే జనవరి 12న విజయ్ దళపతి ‘వారిసు’ (Varisu) (తెలుగులో వారసుడు) విడుదల కానున్నాయి. సంక్రాంతి సెలవులని ఉపయోగించుకుని భారీ వసూళ్ల లక్ష్యంతో ఈ రెండు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో నాలుగు రోజుల క్రితం ‘తునివు’ ట్రైలర్ విడుదలై ఇప్పటికే దాదాపు 53 మిలయన్ల వ్యూస్‌ని సాధించింది. జనవరి 4న ‘వారిసు’ ట్రైలర్ విడుదల కాగా.. ఇప్పటికే 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. దీంతో ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్ మరింత ముదిరింది.

ఎవరి హీరో రికార్డులు నెలకొల్పుతుందో చూద్దామంటూ నెట్టింట ట్విట్ల వార్ చేసుకుంటున్నారు. దీంతో ‘#Varisu & #Thunivu’ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-01-05T12:28:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!