Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్
ABN, First Publish Date - 2023-10-12T21:10:18+05:30
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ సమాజసేవలో ఒక అడుగు ముందుంటారని పలు సందర్భాల్లో నిరూపించారు. తాజాగా ఆయన ఓ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను విశాల్‌కు చెందిన దేవి ఫౌండేషన్ తాజాగా విడుదల చేసింది.
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ (Hero Vishal) సమాజసేవలో ఒక అడుగు ముందుంటారని పలు సందర్భాల్లో నిరూపించారు. తాజాగా ఆయన ఓ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను విశాల్‌కు చెందిన దేవి ఫౌండేషన్ (Devi Foundation) తాజాగా విడుదల చేసింది. మార్క్ ఆంటోని చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో విశాల్.. ఇపుడు హరి (Hari) దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ తూత్తుకుడి జిల్లాలోని విలాత్తికులం, కుమారచక్కణపురం, వీరకాంచీపురం, ఊశిమేసియాపురం వంటి గ్రామాల్లో 20 రోజులుగా షూటింగ్ జరిగింది.
ఇందులో కుమారచక్కణపురానికి (Kumarasakkanapuram) షూటింగ్ కోసం వెళ్ళగా, ఆ గ్రామంలో తాగునీటి సమస్య ఉందన్న విషయాన్ని తెలుసుకున్న విశాల్ తక్షణం స్పందించారు. అప్పటికప్పుడు ఆ గ్రామంలో బోరుబావి (Bore Well) తవ్వించారు. 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సింథటిక్ వాటర్ ట్యాంకులను అమర్చి, గ్రామస్తులంతా నీటిని బిందెల్లో పట్టుకునేందుకు వీలుగా ఆరు ట్యాప్‌లను ఏర్పాటు చేయించారు. దీంతో ఆ గ్రామ ప్రజలంతా విశాల్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
============================
*Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
***********************************
* Tiger 3: వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో ‘టైగర్ 3’ దుమారం.. టార్గెట్‌గా ఇండియా, పాక్ మ్యాచ్
***********************************
*Saindhav: ‘సైంధవ్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
*******************************
*Leo: ‘లియో’కు ప్రభుత్వ సపోర్ట్.. ఇక దుమ్ము లేచి పోవడమే..
************************************
*Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు
*********************************