Laththi Movie: ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైన విశాల్ మూవీ.. ఎప్పటినుంచంటే..
ABN, First Publish Date - 2023-01-13T12:30:33+05:30
కోలీవుడ్ నటుడు విశాల్ (Vishal) హీరోగా నటించిన చిత్రం ‘లాఠీ’ (Laththi). ఎ.వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సునయన హీరోయిన్‌గా నటించింది.
కోలీవుడ్ నటుడు విశాల్ (Vishal) హీరోగా నటించిన చిత్రం ‘లాఠీ’ (Laththi). ఎ.వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సునయన హీరోయిన్‌గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. డిసెంబర్ 22, 2022న ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే విశాల్ నటనకి ప్రశంసలు దక్కాయి. కాగా.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సన్‌నెక్స్ట్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా అధికారికంగా తెలియజేసింది.
కథేంటంటే.. మురళీకృష్ణ(విశాల్) ఓ సిన్సియర్ కానిస్టేబుల్. నిజాయతీ, తెగువ ఉన్న పోలీసుగా పెరుతెచ్చుకుంటాడు. అలాగే కుటుంబ ప్రపంచంగా బతుకుతుంటాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతడిని అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. దాంతో ఓ అధికారి సపోర్టుతో తిరిగి విధుల్లో చేరతాడు. అనంతర డీఐజీ ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని ఆదేశిస్తాడు. తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడిని చితక్కొట్టేస్తాడు. ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ కొడుకు. దాంతో తనను కొట్టిన మురళీపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ రౌడీ నుంచి మురళీ ఎలా తప్పించుకున్నాడు. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం.