సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thangalaan: విక్రమ్ ‘తంగలాన్‌’ ఎంత వరకు వచ్చిందంటే..

ABN, First Publish Date - 2023-07-06T17:38:26+05:30

చియాన్‌ విక్రమ్‌, మాళవిక మోహనన్‌ జంటగా పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తంగలాన్‌’ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. విక్రమ్ కూడా తన ట్విట్టర్ వేదికగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా తెలుపుతూ కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

Chiyaan Vikram and Malavika Mohanan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram), మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) జంటగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో రూపొందుతున్న ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. మొత్తం 118 రోజుల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్‌ మంగళవారంతో ముగిసినట్టు చిత్రం బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా విక్రమ్‌, మాళవిక తమ పాత్రల వేషధారణలో ఉండగా, వారితో కలిసి దర్శకుడు రంజిత్‌ దిగిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

కేజీఎఫ్‌ (Kolar Gold Fields- KGF) బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్‌ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్‌ పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ గోల్డ్‌ ఫ్యాక్టరీ, బంగారు గనుల్లో పనిచేసిన కూలీలపై ఈ సినిమాను దర్శకుడు చిత్రీకరించారు. ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా తన సొంత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాణంలో పా.రంజిత్‌ సొంత బ్యానరు నీలం ప్రొడక్షన్స్‌ కూడా పాలుపంచుకుంది. చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Thangalaan Shooting Wrapped)

ఈ చిత్రానికి ఈ మధ్యకాలంలో సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుడిగా వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్న జీవీ ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి కావడంపై విక్రమ్‌ ట్విటర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఈ సినిమా కోసం 118 రోజుల పాటు గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేశా. అద్భుతమైన అనుభవాలను ఈ సినిమా ఇచ్చింది. ఒక కొత్త ప్రపంచంలో గడిపినట్టుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!

**************************************

*Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

*NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

**************************************

Updated Date - 2023-07-06T17:38:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!