LEO: ఇదెక్కడి మాస్ రా మామ.. 100 థియేటర్లలో లియో రీ రిలీజ్
ABN, First Publish Date - 2023-11-16T20:01:18+05:30
'లియో'.. ఈ సినిమా దసరా సందర్భంగా ఆక్టోబర్19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 625 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి తమిళనాట సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా రిలీజై నెల కావస్తున్నా ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. ప్రస్తుతం ఐదవ వారం విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు ఈ సినిమా విషయంలో కొత్తగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతున్నది.
లియో (LEO).. ఈ సినిమా దసరా సందర్భంగా ఆక్టోబర్19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 625 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి తమిళనాట సరికొత్త రికార్డులను సృష్టించింది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఎల్‌సీయూ సినిమటిక్ యూనివర్స్‌లో మూడవదిగా వచ్చిన ఈ లియో రిలీజై నెల కావస్తున్నా ఎదో విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. ప్రస్తుతం ఐదవ వారం విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు ఈ సినిమా విషయంలో కొత్తగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతున్నది.
ఇప్పటికే ఈ సినిమా 4వ వీకెండ్‌లో 100కు పైగా థియేటర్లలో విజయవంతంగా నడుస్తుండగా ఈ దీపావళికి తమిళనాట కార్తి జపాన్, లారెన్స్ జిగర్తండ, విక్రమ్ ప్రభు నటించిన రైడ్ సినిమాలు విడుదలైనా జనాలను థియేటర్లకు రప్పించలేక పోతున్నాయి. దీంతో థియేటర్ల యాజమాన్యాలన్నీ కలిసి మళ్లీ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 100 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లియో సినిమాను రేపు విడుదల చేయనున్నారు. అదేవిధంగా ప్రతి దీపావళికి విజయ్ (Thalapathy Vijay) సినిమాలు బాగా నడిచిన సందర్భాలు ఉండడంతో కలిసోస్తుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 5 వారాలుగా నడుస్తున్న లియో (LEO) రూ625 కోట్లకు పైగా వసూల్లు చేసి తమిళ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. త్వరలో ఓటీటీలోకి కూడా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్న సమయంలో ఇప్పుడు సినిమా రీ రిలీజ్ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇంతవరకు ఓ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజులలోపే మళ్లీ రీ రిలీజ్ కావడం సినిమా చరిత్రలో బహూషా ఇదే మొదటి సారి అయి ఉంటుదని సినీ అభిమానులు అనుకుంటున్నారు.