సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Antony: ‘పిచ్చైక్కారన్‌’.. నాకు ఆయన వేసిన భిక్ష

ABN, First Publish Date - 2023-05-17T15:34:25+05:30

ఇది ఆయన నాకు వేసిన భిక్ష. ఎప్పటికీ అతనిని మరిచిపోలేను. ‘పిచ్చైక్కారన్‌ 2’ విషయానికి వస్తే.. ఇది సీక్వెల్‌ కాదు. మొదటి దానితో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ సినిమాలో సోదరి సెంటిమెంట్‌

Vijay Antony
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పిచ్చైక్కారన్‌’ (Pichaikkaran) చిత్రం దర్శకుడు, రచయిత శశి (Sasi) వేసిన భిక్ష అని హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) అన్నారు. ఈ చిత్రం తొలి భాగంలో తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ ఉన్నట్టుగానే రెండో భాగంగా అన్నా - చెల్లి సెంటిమెంట్‌ ఉంటుందని ఆయన చెప్పారు. విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానరుపై నిర్మించిన ‘పిచ్చైక్కారన్‌-2’ (Pichaikkaran 2) చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. విజయ్‌ ఆంటోని, కావ్య థాపర్‌, రాధారవి, వైజీ మహేంద్రన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, హరీష్‌ పెరడీ, జాన్‌ విజయ్‌, దేవ్‌ గిల్‌, యోగిబాబు తదితరులు నటించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మాట్లాడుతూ... ఒక చిత్రం విజయానికి రైటర్లు కీలకం. నేను దర్శకత్వం వహించిన అనేక సినిమాలు సక్సెస్‌కు కారణం సినీ రైటర్లే. అలా విజయ్‌ ఆంటోనికి శశి అనే రైటర్‌ ఉన్నారు. కచ్చితంగా సక్సెస్‌ ఖాయమని అన్నారు. దర్శక, నటుడు భాగ్యరాజ్‌ (Bhagyaraj) మాట్లాడుతూ.. విజయ్‌ ఆంటోని సహనశీలి. ఇపుడు సంగీతం, నటుడు, పాటల రచయిత, దర్శకుడు ఇలా అన్ని రంగాల్లో రాణించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దర్శకుడు మోహన్‌ రాజా (Mohan Raja) మాట్లాడుతూ... ‘పిచ్చైక్కారన్‌’ చిత్రం చూసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికిలోనై విజయ్‌ ఆంటోని ఇంటికి వెళ్ళి అభినందించాను. మళ్లీ అలాంటి మంచి సినిమా ఇదవుతుందని అన్నారు.

హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) మాట్లాడుతూ.. ‘పిచ్చైక్కారన్‌’ చిత్రం దర్శకుడు, రచయిత శశి నాకు వేసిన భిక్ష. ఎప్పటికీ అతనిని మరిచిపోలేను. ‘పిచ్చైక్కారన్‌ 2’ విషయానికి వస్తే.. ఇది సీక్వెల్‌ కాదు. మొదటి దానితో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ సినిమాలో సోదరి సెంటిమెంట్‌ ఉంటుంది. ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంకా, నిర్మాత ఫాతిమా విజయ్‌ ఆంటోని (Fatima Vijay Antony), హీరోయిన్‌ కావ్య థాపర్‌ (Kavya Thapar) తదితరులు ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్

*PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

*Kavya Thapar: మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చా

*Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!

Updated Date - 2023-05-17T15:34:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!