Vijay Antony: ఏడేళ్లు అప్పుడు తండ్రిని పోగొట్టుకున్నాడు, ఇప్పుడు కూతురు, ఇద్దరూ ఆత్మహత్యలే
ABN, First Publish Date - 2023-09-19T18:00:14+05:30
విజయ్ ఆంటోనీకి ఏడేళ్లు వున్నప్పుడు అతని తండ్రి చనిపోయారు, ఇప్పుడు విజయ్ కూతురిని పోగొట్టుకున్నారు, ఆ కుటుంబంలో వచ్చిన విషాదాన్ని చూసి తమిళ చిత్ర పరిశ్రమ చలించిపోయి, విజయ్ ఆంటోనీ కి ఈ కష్ట సమయంలో బాసటగా నిలుచుంది.
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ (VijayAntony) ఇంట విషాదం అలుముకుంది. అతని 16 ఏళ్ల కుమార్తె మీరా #Meera ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. పాపం ఆ అమ్మాయి ఎందుకు అంత ఒత్తిడికి గురయింది అనే విషయం తెలియదు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ అంతా విజయ్ ఆంటోనీ కి బాసటగా నిలిచి మేమున్నాం అని అందరూ సాంఘీక మాధ్యమంలో తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. అలాగే చాలామంది విజయ్ ఆంటోనీ ఇంటికి వెళ్లి అతనికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు.
అసలు చిన్న పిల్లలు ఇలా చేసుకోకూడదు అని, ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలని అందరూ ఆ మెసేజ్ లలో మిగతా పిల్లలకు చెపుతున్నారు. మేమున్నది మీ కోసమే, మేము కష్టపడుతున్నది కూడా మీ సంతోషం కోసమే అని జయం రవి (JayamRavi) తన మెసేజ్ లో అన్నాడు.
పాపం విజయ్ ఆంటోనీ కుటుంబంలో ఇలా ఆత్మహత్యలు చేసుకునే ఫోబియా వుంది అని అంటున్నారు. విజయ్ ఏడేళ్లు వున్నప్పుడు అతని తన తండ్రిని పోగొట్టుకున్నాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇప్పుడు అతను తన కుమార్తెను పోగొట్టుకున్నాడు, ఆమె కూడా ఆత్మహత్యే చేసుకుంది. పాపం విజయ్ ఆంటోనీ కష్టం అంటే ఎలా ఉంటుంది అనే విషయం తెలియడానికి.. ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
మీ కుమార్తె ఇలా పోవటం మనసుకి చాలా బాధ కలిగించింది విజయ్ ఆంటోనీ బ్రదర్. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు, మీకు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఇటువంటి కష్ట సమయంలో మీరు చాలా బలంగా ఉండాలి అని ఖుష్బూ (Khushbu) ట్వీట్ చేశారు. అలాగే మహత్ రాఘవేంద్ర, జయం రవి, విశాల్ (Vishal), రాఘవ లారెన్స్ (RaghavaLawrence) సాంఘీక మాధ్యమంలో మెసేజ్ పెడితే, శింబు (Simbhu), లియో #Leo చిత్ర నిర్మాత ఇంకా చాలామంది చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు విజయ్ ఆంటోనీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు 'బిచ్చగాడు' #Bichagadu సినిమాతో. ఈమధ్యనే వచ్చిన 'బిచ్చగాడు 2' #Bichagadu2 కూడా తెలుగులో పెద్ద హిట్ అయింది.