కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay Antony: పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. చిన్నకుమార్తెతో కలిసి విజయ్‌ ఆంటోని ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2023-09-30T21:30:16+05:30

తన వల్ల నిర్మాతకు నష్టం రాకూదని, ఆయన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో విజయ్‌ ఆంటోని చిత్ర ప్రమోషన్‌ కోసం తన చిన్న కుమార్తెతో కలిసి ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. తన పెద్ద కుమార్తె ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే.

Vijay Antony with His Younger Daughter

తన వల్ల నిర్మాతకు నష్టం రాకూదని, ఆయన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) చిత్ర ప్రమోషన్‌ కోసం తన చిన్న కుమార్తెతో కలిసి ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. తన పెద్ద కుమార్తె ఆత్మహత్యతో కుటుంబం దుఃఖంలో ఉన్నప్పటికీ తాను హీరోగా నటించిన ‘రత్తం’ (Raththam) చిత్ర విడుదలను ఆపరాదని నిర్ణయించారు. ఇదే విషయాన్ని నిర్మాతకు తెలపడమే కాకుండా, ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలకు తాను కూడా వస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆ విధంగానే తాజాగా చెన్నైలో జరిగిన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. (Raththam Pre Release Event)

ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు కమల్‌ బోరా, జి.ధనుంజయన్‌, ప్రదీప్‌ బి, పంకజ్‌ బోరా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సీఎస్‌ అముదన్‌ దర్శకుడు. విజయ్‌ ఆంటోని హీరోగా నటించగా.. మహిమా నంబియార్‌ (Mahima Nambiar), నందితా శ్వేత (Nandita Swetha), రమ్య నంబీశన్‌ (Ramya Nambeesan) హీరోయిన్లుగా నటించారు. సంగీతం కన్నన్‌ నారాయణన్‌. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ... దర్శకుడు అముదన్‌ నుంచి రానున్న మరో విభిన్న కథా చిత్రం. ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అన్నారు.


దర్శకుడు అముదన్‌ (Amudhan) మాట్లాడుతూ... ‘సాధారణంగా చిత్ర నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాక ఇలాంటి ఫంక్షన్లను గ్రాండ్‌గా నిర్వహిస్తుంటాం. కానీ, ఇపుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా తండ్రి చనిపోయినపుడు మొట్టమొదట వచ్చి నన్ను ఓదార్చిన వ్యక్తి విజయ్‌ ఆంటోని. ఆ రోజు ఆయన నాకు చెప్పిన మాటలు గుర్తున్నాయి. అవే మాటలు ఇపుడు విజయ్‌ ఆంటోనికి చెబుతున్నాం.. ‘మీ వెంట మేమున్నాం’ అని అన్నారు. కాగా, ఈ చిత్రం తమిళనాట జరిగిన వరుస హత్యలను కథాంశంగా తీసుకుని తెరకెక్కించారు. విజయ్‌ ఆంటోని న్యూస్‌ ఎడిటర్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అక్టోబరు 6న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Namrata and Sitara: మానీక్విన్స్ బొమ్మల కొలువులో నమ్రత, సితూ పాప సందడి

************************************

*Vijay Antony: మరో మెగాస్టార్ చిరు మూవీ టైటిల్‌కి ఫిక్సయిన విజయ్ ఆంటోని

************************************

*Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది

************************************

*Varun Tej: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్

************************************

Updated Date - 2023-09-30T21:30:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!