సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vignesh Shivan: అజిత్ తప్పేమీ లేదు

ABN, First Publish Date - 2023-04-07T16:31:33+05:30

కోలీవుడ్ సూపర్ స్టార్స్‌లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. చివరగా ‘తుణివు’ (Thunivu)లో నటించారు. ఈ చిత్రం తమిళ్‌లో సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ‘తుణివు’ అనంతరం అజిత్ ఏ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ సూపర్ స్టార్స్‌లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. చివరగా ‘తుణివు’ (Thunivu)లో నటించారు. ఈ చిత్రం తమిళ్‌లో సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ‘తుణివు’ అనంతరం అజిత్ ఏ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో నటించాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించాలి. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే 62’ (AK 62) అని ప్రకటించారు. ఈ మూవీ డైరెక్షన్ నుంచి విఘ్నేశ్ కొన్నాళ్ల క్రితమే తప్పుకొన్నారు. అందుకు గల కారణాన్ని విఘ్నేశ్ తాజాగా వెల్లడించారు. అనంతరం ఈ ప్రాజెక్టు డైరెక్టర్ ప్లేస్‌లోకి మగిజ్ తిరుమెని (Magizh Thirumeni) వచ్చారు.

విఘ్నేశ్ శివన్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏకే 62 గురించి మాట్లాడారు. తాను సినిమా నుంచి తప్పుకోవడంలో అజిత్ కుమార్ తప్పేమి లేదని తెలిపారు. నిర్మాతలు స్క్రిఫ్ట్ సెకండ్ హాఫ్‌తో సంతోషంగా లేరన్నారు. జరిగిన విషయానికి అజిత్‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. మగిజ్ తిరుమేని భారీ విజయం అందుకోవాలని కోరారు. ‘‘ఏకే62 నాకు నిరాశను మిగిల్చింది. అజిత్ కుమార్ వైపు నుంచి ఎటువంటి తప్పులేదు. సెకండ్ హాఫ్‌తో నిర్మాణ సంస్థ సంతృప్తి చెందలేదు. మగిజ్ తిరుమెనికి ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అని విఘ్నేశ్ శివన్ తెలిపారు.

విఘ్నేశ్ శివన్ తప్పుకొన్న అనంతరం ‘ఏకే 62’ కు సంబంధించి మేకర్స్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మూవీ టైటిల్‌ను కూడా ప్రకటించలేదు. మగిజ్ తిరుమెని దర్శకత్వం వహిస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఎటువంటి ప్రకటనను జారీ చేయలేదు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-07T16:33:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!