సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vetri Maaran: ‘ఆస్కార్ క్యాంపెయినింగ్‌లో నేను తెలుసుకుందిదే’

ABN, First Publish Date - 2023-01-11T15:38:45+05:30

జాతీయ అవార్డు విన్నర్ (National Award winner) వెట్రిమారన్ (Vetri Maaran) దర్శకత్వం వహించిన చిత్రం ‘విసారనై’ (Visaranai) 2016లో ఆస్కార్‌కి భారతీయ అధికారిక ఎంట్రీగా వెళ్లింది.

Vetrimaaran
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ అవార్డు విన్నర్ (National Award winner) వెట్రిమారన్ (Vetri Maaran) దర్శకత్వం వహించిన చిత్రం ‘విసారనై’ (Visaranai) 2016లో ఆస్కార్‌కి భారతీయ అధికారిక ఎంట్రీగా వెళ్లింది. తెలుగులో ‘విచారణ’. అయితే.. అప్పుడు ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ కాలేకపోయింది. కానీ.. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ.. అక్కడ ప్రమోషన్స్ కోసం చేసిన ఖర్చు సినిమా అసలు బడ్జెట్ కంటే ఎక్కువైందని తెలిపాడు. అలాగే ఆస్కార్ క్యాంపెయినింగ్‌లో తను తెలుసుకున్న నాలుగు విషయాల గురించి వివరించాడు. ఆస్కార్ ఫీవర్ ఫీక్స్‌లో ఉన్న ఈ తరుణంలో ఆయన మాటలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

1. ఓ మంచి పీఆర్ పర్సన్‌ని వెతికి పట్టుకోవాలి. దానివల్ల మీ సినిమా అవార్డ్స్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ కొద్దిమంది మాత్రమే టాలెంటెడ్ పీఆర్‌లు ఉన్నారు.

2. ఆస్కార్ అవార్డు ఫీవర్ ఉండే మూడు నెలలు అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి నామినేట్ అయ్యే వరకు చాలా ఖర్చు అవుతుంది. ఒక్కో స్థాయిలో 5000 నుంచి 15000 డాలర్ల ఖర్చు చేయాల్సి వచ్చింది. లాస్ ఏంజెల్స్‌లో విందులు, పార్టీలు ఏర్పాటు చేయాలి.

3. గుర్తింపు కావాలంటే కష్టపడాలి. యాడ్స్ ఇవ్వాలి. వెరైటీ, ది హాలీవుడ్ రిపోర్టర్ వంటి మేగజైన్స్‌లో యాడ్స్ ఇవ్వాలి. దానికి దాదాపు 32వేల డాలర్లు ఖర్చు అయ్యింది. అప్పుడే వారు మన సినిమాని గుర్తుపడతారు.

4. ఆస్కార్‌కి ఓటింగ్ వేసేవారిలో చాలామంది పెద్ద వయస్సు వారు ఉంటారు. వారికి ఎక్కువగా హృదయాన్ని కదిలించే సినిమాలంటే ఇష్టం. అందుకే కాన్సెప్ట్ ఎలా ఉన్నా.. వాళ్లకి నచ్చేరీతిలో ఉండకపోతే వారు పట్టించుకోరు. ‘విసారనై’ అలాంటి చిత్రమే. అందుకే షార్ట్‌లిస్ట్ కాలేకపోయింది.

Updated Date - 2023-01-11T15:38:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!