కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

ABN, First Publish Date - 2023-09-08T10:54:56+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశం పేరు ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ స్పందించారు. తన వరకు ‘ఇండియా’ పేరు చాలన్నారు. జాతీయ అవార్డులపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Director Vetrimaaran

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశం పేరు ‘ఇండియా’ (India) నుంచి ‘భారత్‌’ (Bharat)గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ (Vetrimaaran) స్పందించారు. తన వరకు ‘ఇండియా’ పేరు చాలన్నారు. అయితే, జాతీయ అవార్డులపై తనకంటూ ఒక అభిప్రాయం ఉందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘‘మనం ఒక చిత్రాన్ని జాతీయ అవార్డుల (National Awards) కోసం పంపిస్తున్నామంటే... సెలక్షన్‌ కమిటీ నిర్ణయానికి కట్టుబడివున్నామన్న అంగీకారంతోనే పంపుతున్నాం. ఆ సెలక్షన్‌ కమిటీ ఉత్తమమైనదా? కాదా? సక్రమంగానే ఎంపిక చేశారా? అన్నది తర్వాతి అంశం. మనం అవార్డు కోసం పంపిన చిత్రంపై తుది నిర్ణయం సెలక్షన్‌ కమిటీదే. అది తీసుకునే నిర్ణయాన్ని గౌరవించాలి. మనం పంపిన చిత్రానికి అవార్డు ఇచ్చిందా లేదా అన్నది ఎంపిక కమిటీ నిర్ణయం. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం ఒక చిత్రం నాణ్యతను, సమాజంపై చూపే ప్రభావాన్ని తీర్మానించడం లేదు. ‘జైభీమ్‌’ చిత్రాన్ని ఎందుకు తీశారో.. ఆ పనిని పూర్తి చేసింది’’ అని వెట్రిమారన్‌ పేర్కొన్నారు.


ఇక దేశం పేరు మార్పు గురించి వెట్రిమారన్ మాట్లాడుతూ.. నాకు ‘ఇండియా’ అంటేనే ఇష్టం. ‘భారత్’ అని మార్చినా.. ఇండియా అనే అంటారు. నా వరకు ‘ఇండియా’ అనే పేరు చాలు. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం వెట్రిమారన్ ‘విడుదలై పార్ట్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోతో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

***********************************

*Rudram Kota: ‘రుద్రంకోట‌’ రిలీజ్‌కు రెడీ..

*************************************

*Rama Banam: ‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

*************************************

*MSMP Recipe Challenge: ఛాలెంజ్ స్వీకరించి.. ఇష్టమైన రెసిపీ ఏంటో తెలిపిన రామ్ చరణ్

*************************************

Updated Date - 2023-09-08T10:54:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!