సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Varalaxmi Sarathkumar: కోలీవుడ్‌లో పట్టించుకోట్లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన నటి

ABN, First Publish Date - 2023-02-14T14:21:08+05:30

తమిళ చిత్రపరిశ్రమలో తనలాంటి ప్రతిభ కలిగిన అనేక మంది నటీనటులకు సరైన ఆదరణ లేదని నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) వాపోయింది.

Varalaxmi Sarathkumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ చిత్రపరిశ్రమలో తనలాంటి ప్రతిభ కలిగిన అనేక మంది నటీనటులకు సరైన ఆదరణ లేదని నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) వాపోయింది. తనకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉందని, అందువల్ల హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆమె తెలిపింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కొండ్రాల్‌ పావం’ (kondral paavam). తెలుగులో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించిన ‘అనుకోని అతిథి’ మూవీకి ఇది రిమేక్. ఈ చిత్రానికి దయాళ్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించాడు. మార్చి 3న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ని మూవీ టీం జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పాల్గొంది.

వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘మల్లిక అనే పాత్రలో నటించాను. ఒక విభిన్నమైన మూవీలో నటించడం సంతోషంగా ఉంది. నేను తెలుగులో బిజీగా ఉండటానికి కారణం.. అక్కడి ప్రేక్షకుల ఆదరణ. తెలుగు చిత్రాల్లో నేను చేసే ప్రతి పాత్రను వారు ఇష్టపడుతున్నారు. గౌరవంతో పాటు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆ తరహా ఆదరణ కనిపించలేదు. అందుకే హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవ్వాలని భావిస్తున్నాను. నెగటివ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాననే విమర్శలు వస్తున్నాయి. దాని గురించి నాకేం దిగులు లేదు. నిజం చెప్పాలంటే.. ఇతర నటీమణులు ఆశ్చర్యపోయే పాత్రల్లో నటించానని చెప్పగలను’ అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Pradeep Ranganathan: సూపర్‌స్టార్ల‌కి కథ చెప్పిన యువ దర్శకుడు!?

దర్శకుడు దయాళ్‌ పద్మనాభన్‌ మాట్లాడుతూ.. కన్నడ, తెలుగు భాషల్లో 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాను. విల్లుపురం చెందిన వాడిని. ఇది నాకు తొలి తమిళ చిత్రం. 12వ శతాబ్దానికి చెందిన ఒక సాహిత్య కథ. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో బాగా పాపులర్‌ అయింది. దీన్ని ఆధారంగా చేసుకుని 1980లో ధర్మపురి నేపథ్యంలో చిత్రీకరించి క్లాసికల్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందించామ’ని వివరించాడు.

Updated Date - 2023-02-14T14:21:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!