Ticket Prices Hike: సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై రచ్చ రచ్చ
ABN, First Publish Date - 2023-07-07T21:13:47+05:30
తమిళ నాడు రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరల పెంచాలని కోరుతూ ఒక సంఘం వినతి చేయగా... మరో సంఘం మాత్రం పెంచాల్సిన అవసరం లేదని అంటోంది. దీంతో తమిళ చిత్రపరిశ్రమలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు తిరుపూరు సుబ్రమణ్యం.. టిక్కెట్ ధరల పెంపు వల్ల కలిగే అనర్థాలను చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరల పెంచాలని (Ticket Prices Hike) కోరుతూ ఒక సంఘం వినతి చేయగా... మరో సంఘం మాత్రం పెంచాల్సిన అవసరం లేదని అంటోంది. దీంతో తమిళ చిత్రపరిశ్రమలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తమిళనాడు ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది. ఏసీ సౌకర్యం ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధరను రూ.250, నాన్ ఏసీ థియేటర్‌లో రూ.150, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని ఏసీ థియేటర్లలో రూ.200, నాన్ ఏసీ థియేటర్‌లో రూ.120, ఐమ్యాక్స్‌లో రూ.450, ఈపీఐక్యూలో రూ.400, రీక్లైనర్ సీట్ ధర రూ.350 చొప్పున పెంచాలని కోరింది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు తిరుపూరు సుబ్రమణ్యం (Tirupur Subramaniam) మాత్రం మరోలా స్పందిస్తున్నారు.
‘‘రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలు పెంచాలని కోరుతూ ఒక సంఘం చేసిన విజ్ఞప్తికి తమకు ఎలాంటి సంబంధం లేదు. ఇపుడు సినిమా టిక్కెట్ ధరలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా సముచితంగానే ఉన్నాయి. గరిష్ఠ టిక్కెట్ ధర రూ.150గా ఉండగా, దీనికి ఇతరాత్రా పన్నులన్నీ కలిసి రూ.190గా ఉంది. పైగా ప్రస్తుతం సినిమాల కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. చిన్నపాటి ఊర్లలో థియేటర్లను నడపడమే గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టిక్కెట్ ధరలను పెంచితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. టిక్కెట్ ధరలను పెంచితే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మూతపడ్డాయో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కానీ తమ సంఘం తరపున కొన్ని విన్నపాలు చేస్తున్నాం. (Kollywood)
ఆస్తిపన్ను, విద్యుత్ చార్జీలను తగ్గించాలి. థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలను ఏసీ థియేటర్‌కు రూ.10, నాన్ ఏసీ థియేటర్లకు రూ.5 చొప్పున పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్నును రద్దు చేయాలి. జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వినోదపు పన్ను తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే అమల్లో ఉంది. దీన్ని రద్దు చేస్తే టిక్కెట్ ధర రూ.20 మేరకు తగ్గుతుంది. సినిమా టిక్కెట్ ధరను రూ.250కి పెంచితే చిన్న బడ్జెట్ చిత్రాలకు కలెక్షన్లు పూర్తిగా పడిపోతాయి. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు థియేటర్లు ఉండాలన్నదే తమ ఆకాంక్ష’’ అని సుబ్రమణ్యం అన్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..
**************************************
*Aadikeshava: ఆగస్ట్ లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది
**************************************
*Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు
**************************************
*Vijayashanthi: నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే..
**************************************
*Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..
**************************************